News June 19, 2024
నెల్లూరు జిల్లాకు రూ.33.19 కోట్ల కేటాయింపు
నెల్లూరు జిల్లాకు పీఎం కిసాన్ కింద రూ.33.19 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ప్రధానమంత్రి మోదీ వారణాసి నుంచి మంగళవారం ఆన్‌లైన్ విధానంలో నిధులు విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏటా మూడు విడతల్లో రూ.6 వేలు రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తోంది. జిల్లాలో అర్హత కలిగిన 1,65,978 మంది రైతుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేస్తామని జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి తెలిపారు.
Similar News
News September 15, 2024
నెల్లూరు: వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
వినాయక నిమజ్జనం కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. గూడూరు మండలం చెన్నూరు గిరిజన కాలనీ వాసులు వినాయక విగ్రహాన్ని తూపిలిపాళెం సముద్రంలో నిమర్జనం చేసి తిరిగివస్తుండగా, వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ చిల్లకూరు మండలం కడివేడు సమీపంలో అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలు కాగా, క్షతగాత్రులను గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
News September 15, 2024
నెల్లూరు :ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు
నెల్లూరు జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో జరగనున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించట్లేదని కలెక్టర్ ఆనంద్ ఒక ప్రకటన విడుదల చేశారు. మీలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా సోమవారం అర్జీలు స్వీకరించలేమని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రజలు, అర్జీదారులు గమనించవలసినదిగా ఆయన కోరారు. వచ్చే సోమవారం యధావిధిగా కార్యక్రమం జరుగుతుందని వెల్లడించారు.
News September 15, 2024
నెల్లూరు: రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రద్దు
ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఈ సోమవారం మిలాద్ ఉన్ నబీ పండగ సెలవు కావడంతో నిర్వహించడం లేదని జిల్లా పోలీసు కార్యాలయ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. నెల్లూరు జిల్లాలోని ప్రజలు, ఫిర్యాదు దారులు ఈ విషయాన్ని గమనించగలరని పోలీస్ శాఖ అధికారులు కోరారు.