News November 28, 2024
నెల్లూరు జిల్లాకు రెడ్ అలర్ట్

నెల్లూరు జిల్లాకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరో 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 45 నుంచి 65 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వారు స్పష్టం చేశారు. కాగా మత్స్యకారులు ఎవ్వరూ వేటకు వెళ్లరాదని ఇప్పటికే అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే.
Similar News
News April 15, 2026
1,250 మెకనైజడ్ బోట్లను ఇవ్వాలనుకున్నాం: YS జగన్

తాము జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో 1,250 మెకనైజడ్ బోట్లకు సదుపాయం కలిగేలా నిర్మాణం చేపట్టామని మాజీ CM జగన్ అన్నారు. ఆ బోట్లను కేవలం 10% మత్స్యకారులు కట్టుకుంటే, 40% రాయితీ ఇచ్చి, మిగిలిన దాన్ని లోన్ రూపంలో అందించే వాళ్లమన్నారు. అదే జరిగితే ఇప్పటికి 15 మంది మత్స్యకారులు ఆ బోట్లకు యజమానులై ఉండేవారన్నారు. కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, ఐస్ ప్లాంట్లు నడిచేవని, బోట్ల రిపేరు యూనిట్లు పనిచేసేవన్నారు.
News April 15, 2026
సీజ్ చేసిన బంగారాన్ని వదులుతారా చంద్రబాబు: YS జగన్

‘సీజ్ చేసిన బంగారాన్ని మీ ప్రభుత్వం విడుదల చేస్తుందా.. అలాంటప్పుడు సీజ్ చేసిన బోట్లను ఏవిధంగా వదిలి పెడతారు’ అని CM చంద్రబాబును మాజీ CM జగన్ జువ్వలదిన్నెలో ప్రశ్నించారు. మత్స్యకారుల గురించి ఏనాడు చంద్రబాబు ఆలోచించలేదన్నారు. తాము బ్లూ రేవల్యూషన్ పెంచేందుకు ప్రతి 50 కీ.మీ లకు హార్భర్‌లను తీసుకోచ్చమన్నారు. ఫిషింగ్ హార్భర్‌ను జాతికి అంకితం చేస్తే.. ఇప్పటి వరకు మత్స్యకారులకు ఎందుకు ఇవ్వలేదని ఆరోపించారు
News April 15, 2026
ఇంటర్ ఫలితాలు.. 7వ స్థానంలో నెల్లూరు జిల్లా

ఇంటర్ ఫలితాల్లో నెల్లూరు జిల్లా <<19653702>>విద్యార్థులు సత్తా<<>> చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 25147 మందికి 19682 మంది పాసయ్యారు. 78 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 7వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 24141 మంది పరీక్షలు రాయగా 19771 మంది పాసయ్యారు. 82 శాతం పాస్ పర్సంటేజీతో నెల్లూరు జిల్లా రాష్ట్రంలోనే ఇంటర్-1 ఇయర్‌లో 7వ స్థానం, సెకండ్ ఇయర్‌లో 9వ స్థానంలో నిలిచింది.


