News April 12, 2024

నెల్లూరు జిల్లాకు 8వ స్థానం

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 69 శాతంతో నెల్లూరు జిల్లా రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచింది. 24,620 మందికి 17,100 మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్‌లో 81 శాతంతో 6వ స్థానంలో నిలిచింది. 21,293 మందికి 17,292 మంది పాసయ్యారు. ఫస్ట్ ఇయర్‌లో తిరుపతి జిల్లా 70 శాతంతో 7వ స్థానంలో నిలవగా.. 29,915 మందికి 20,919మంది పాసయ్యారు. సెకండ్ ఇయర్‌లో ఇదే జిల్లా 81 శాతంతో 7వ స్థానంలో నిలిచింది. 25,990మందికి 21,062 మంది పాసయ్యారు.

Similar News

News March 24, 2025

అమరావతి కాంట్రాక్ట్‌ల్లో అవినీతి: కాకాణి

image

అమరావతి కాంట్రాక్ట్‌ల్లో భారీ అవినీతి జరిగిందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. 8 అనుకూల సంస్థలకే రూ.28,210 కోట్ల విలువైన పనులు అప్పగించారన్నారు. మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల నుంచి 8 శాతం కమీషన్లు పుచ్చుకున్నారన్నారు.

News March 24, 2025

బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా తోటపల్లిగూడూరు వాసి

image

బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తోటపల్లిగూడూరుకు చెందిన జానకి ప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం విజయవాడ బీఎస్పీ కార్యాలయంలో రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. అలాగే కార్యక్రమంలో జానకి ప్రసాద్‌కు బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తి రుపతి, చిత్తూరు జిల్లాల ఇన్‌ఛార్జ్ బాధ్యతలను అప్పగించారు. పార్టీ అభివృద్ధికి తాను చేసిన సేవలను గుర్తించినందుకు ఆయన పార్టీ నేతలకు ధన్యవాదాలు తెలియజేశారు.

News March 24, 2025

నెల్లూరు: ఆన్‌లైన్‌లో పరిచయం.. రూ.18 లక్షల మోసం

image

హనీ‌ట్రాప్‌కు గురై ఓ వ్యక్తి రూ.18 లక్షలు పోగొట్టుకున్న ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. వరికుంటపాడుకు చెందిన తనకు ఆన్లైన్ ద్వారా దుర్గాభవాని అనే మహిళ పరిచయమైందని, అనారోగ్యంగా ఉందని నమ్మించి తన దగ్గర రూ.18 లక్షలు తీసుకొని తిరిగి ఇవ్వడం లేదని వాపోయాడు. ఈ మేరకు సోమవారం పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఫిర్యాదు చేశాడు.

error: Content is protected !!