News August 22, 2024
నెల్లూరు జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ

జిల్లాలో ఇసుక అక్రమ రవాణా చేస్తే ఉపేక్షించేదిలేదని, బ్లాక్ మార్కెటింగ్ అక్రమ డంపులపై కఠిన చర్యలు తీసుకుంటామని
ఎస్పీ జీ.కృష్ణకాంత్ హెచ్చరించారు. మర్రిపాడులో ఉన్న ఇసుక రీచ్ వద్ద పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. స్టాక్ పాయింట్ ప్రాంతానికి వే బిల్లులు, టైం స్లాట్లో ఉన్న వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తామన్నారు. టోల్ ప్లాజా వద్ద టీంలు ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేస్తామన్నారు.
Similar News
News November 19, 2025
మర్రిపాడు: నవోదయ విద్యాలయంలో విద్యార్థిని ఆత్మహత్య

మర్రిపాడు మండలం కృష్ణాపురంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో సమాచారం అందుకున్న ఆత్మకూరు సీఐ గంగాధర్ విద్యాలయానికి చేరుకొని విద్యార్థిని మృతిపై విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 19, 2025
నెల్లూరులో చిక్కనంటున్న.. ఆకుకూరలు

మార్కెట్లో ఆకుకూరల ధరలు ఆకాశానంటుతున్నాయి. రూ. 20కి తోటకూర 3, చిర్రాకు 3, గోంగూర 3 కట్టలు ఇస్తున్నారు. గతంలో ఈ ధరకు రెట్టింపు ఇచ్చేవారు. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు తోటలు దెబ్బతిని ఉత్పత్తి తగ్గింది. ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకువడంతో ధరలు అమాంతం పెరిగాయి. వీటితోపాటు కూరగాయల ధరలు సైతం మండుతున్నాయి. దీంతో సామాన్యుడు జేబుకు చిల్లుపడుతోంది.
News November 19, 2025
ఉదయగిరి: బాలికపై యువకుడు లైంగిక దాడి

బాలికపై యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన మంగళవారం దుత్తలూరు మండలంలో చోటుచేసుకుంది. 9వ తరగతి చదువుతున్న బాలికకు కొద్ది నెలల క్రితం వింజమూరుకు చెందిన సాథిక్ అనే యువకుడికి పరిచయమయ్యాడు. ఈక్రమంలో బాలికను ఉదయగిరి దుర్గంపైకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడగా అస్వస్థతకు గురైంది. బాలికను హాస్పిటల్కి తీసుకెళ్లగా అత్యాచారానికి గురైందని డాక్టర్లు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. వారు కేసు నమోదు చేశారు.


