News August 22, 2024
నెల్లూరు జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు: ఎస్పీ

జిల్లాలో ఇసుక అక్రమ రవాణా చేస్తే ఉపేక్షించేదిలేదని, బ్లాక్ మార్కెటింగ్ అక్రమ డంపులపై కఠిన చర్యలు తీసుకుంటామని
ఎస్పీ జీ.కృష్ణకాంత్ హెచ్చరించారు. మర్రిపాడులో ఉన్న ఇసుక రీచ్ వద్ద పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. స్టాక్ పాయింట్ ప్రాంతానికి వే బిల్లులు, టైం స్లాట్‌లో ఉన్న వాహనాలను మాత్రమే అనుమతి ఇస్తామన్నారు. టోల్ ప్లాజా వద్ద టీంలు ఏర్పాటు చేసి నిరంతరం తనిఖీలు చేస్తామన్నారు.
Similar News
News January 19, 2026
నెల్లూరు: నేడు పాఠశాలలు ప్రారంభం

సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో జిల్లావ్యాప్తంగా నేడు పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే విద్యార్థులతో స్కూల్ ప్రాంగణాలు కిటకిటలాడాయి. ఉపాధ్యాయులు హాజరై తరగతులు నిర్వహించారు. సెలవుల తరువాత మళ్లీ చదువుల వాతావరణం నెలకొనడంతో విద్యార్థుల్లో ఉత్సాహం కనిపించింది. తల్లిదండ్రులు పిల్లలను స్కూళ్లకు పంపుతూ హర్షం వ్యక్తం చేశారు.
News January 19, 2026
నెల్లూరు: 108 వాహనాల్లో పైలెట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

నెల్లూరు జిల్లాలో 108 వాహనాల్లో పైలెట్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటన తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణులై హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు జనవరి 21, 22వ తేదీలలో తిరుపతి జిల్లా అలిపిరి రోడ్డులోని DMHO కార్యాలయం నందు హాజరుకావాలని సూచించారు.
News January 19, 2026
నెల్లూరు: ఇరిగేషన్లో రూ.100 కోట్లు పక్కదారి!

మొంథా తుఫాను నిధులు పక్కదారి పట్టాయి. జిల్లాకు రూ.100 కోట్లు మంజూరైతే.. పనులు చేయకుండానే బిల్లులు పెట్టేశారు. ఈ వ్యవహారంలో ఓ DAO తన కొడుకు, బంధువుల ఫోన్ పేకి అమౌంట్ ట్రాన్సఫర్ చేయించుకోవడంతో అవినీతి బట్ట బయలైంది. ఈ విషయం రాష్ట్రస్థాయికి చేరడంతో విచారణ అధికారి వచ్చి వెళ్లారు కానీ ఫైళ్లు ముందుకు కదలలేదు. తుఫానుతో చెరువులు కరకట్లు, షట్టర్లు, కాలువల మరమ్మతుల చేపట్టిన దాఖలాలు లేవు.


