News November 8, 2024
నెల్లూరు జిల్లాలో అసాంఘీక కార్యకలాపాల అడ్డుకట్టే లక్ష్యం: ఎస్పీ
నెల్లూరు జిల్లాలో అసాంఘీక కార్యకలాపాల అడ్డుకట్టే లక్ష్యంగా సిబ్బంది కృషి చేస్తున్నారని ఎస్పీ జీ.కృష్ణ కాంత్ తెలిపారు. నగరంలోని నవాబ్ పేట పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో 35 మంది సిబ్బందితో 400 ఇల్లు కార్డెన్ సర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 15 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, దొంగతనాల నివారణ, శాంతిభద్రతల పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
Similar News
News December 14, 2024
రోడ్డు ప్రమాదంలో నెల్లూరు యువతి స్పాట్ డెడ్
శ్రీకాళహస్తి పట్టణం వీఎం పల్లి వద్ద వంతెనపై లారీ చక్రాల కింద పడి యువతి మృతి చెందింది. తిరుపతి నుంచి నాయుడుపేట వైపు వెళ్తున్న లారీని తిరుపతి నుంచి నెల్లూరుకు బైక్‌పై వెళ్తున్న నెల్లూరుకు చెందిన హేమలత (22) ఒవర్‌టేక్ చేసింది. ఈ క్రమంలో ఆమె బ్యాగు లారీకి తగిలి లారీ చక్రాల కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందింది. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News December 14, 2024
నెల్లూరు: కోడిగుడ్డు ధర రూ.10?
నెల్లూరు జిల్లాలో కోడిగుడ్డు ధరలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం కోడిగుడ్డు ధర పలు ప్రాంతాల్లో రూ.7.50కు చేరింది. వారం రోజుల క్రితం వరకు ఈ ధర రూ.5 నుంచి రూ.6 వరకు ఉండేది. వచ్చే క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో గుడ్డు ధరలకు రెక్కలు వచ్చినట్లు స్థానికులు వాపోయారు. మరిన్ని రోజుల్లో ఈ ధర రూ.10కు చేరొచ్చని వ్యాపారులు వెల్లడించారు. మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News December 14, 2024
నేడు నెల్లూరు జిల్లాలో ఎన్నికలు
నేడు నెల్లూరు జిల్లాలోని 13 డిస్ట్రిబ్యూటరీ కాలువలు, 490 వాటర్ యూజర్ అసోసియేషన్లు, 3,698 టీసీలకు ఎన్నికలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా 2.95లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తొమ్మిది గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభంకానుంది. ఈ ఎన్నికలకు 9,120 మంది సిబ్బందిని అధికారులు నియమించారు.