News March 3, 2025

నెల్లూరు జిల్లాలో ఇవాళ్టి ముఖ్య ఘటనలు

image

✒ నెల్లూరు జిల్లాలో ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు
✒ అనుమానాస్పద కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి: SP
✒ పొదలకూరు : రావి ఆకుపై నెలవంక. మసీదు చిత్రం
✒ మిస్ నెల్లూరు-2025గా విజేతగా HONEY PRIYA
✒నెల్లూరు: రూ. 1000 కోట్లు విలువైన ఆ భూమి ఎవరిది?
✒ సోమశిల: నిషేధిత వలలతో జీవనోపాధి కోల్పోతున్న స్థానిక జాలర్లు
✒ నెల్లూరులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ హీరోయిన్ సందడి
✒ పశువుల కాపర్లపై చేజర్ల SI దాడి.?

Similar News

News October 18, 2025

పవన్ కళ్యాణ్ వద్దకు చేరిన నెల్లూరు పంచాయితీ

image

జిల్లా పర్యవేక్షకులు అజయ్ కుమార్ తీరుపై జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జులు పలు విమర్శలు చేశారు. దీంతో డైరెక్ట్‌గా DCM పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. నెల్లూరు జిల్లాకు చెందిన అన్ని నియోజకవర్గాల ఇన్‌ఛార్జులను శనివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి రావాలని సందేశాలు పంపారు. దీంతో నెల్లూరు జిల్లాలో రెండు రోజుల క్రితం తిరుగుబాటు జెండా ఎగురవేసిన జనసేన నేతలందరూ శుక్రవారం విజయవాడ బయలుదేరారు.

News October 17, 2025

నెల్లూరులో ఆక్రమణలపై కొరడా..!

image

ఇటీవల NMC అధికారులు రోడ్డు మార్జిన్లపై కొరాడ జలిపిస్తున్నారు. ప్రధానంగా నెల్లూరులో సైడు కాలువలపై ఆక్రమణలు పెరిగిపోయాయి. ప్రధాన ట్రంకురోడ్డు, పొదలకూరు రోడ్డు, రంగనాయకులపేట, సంతపేట, గాంధీ బొమ్మ, కనకమహాల్ ఇలా ప్రధానమైన చోట్ల కాలువలను ఆక్రమించేశారు. ఫలితంగా గతంలో ఎన్నడూ లేనంతగా కార్పొరేషన్ ఆక్రమనలను తొలగిస్తున్నారు. ఇప్పటికే పలుచోట్లా అక్రమణలను ధ్వంసం చేస్తున్నారు.

News October 17, 2025

రైతులకు యూనిక్ నంబర్లు తప్పనిసరి: సత్యవతి

image

రైతులకు ప్రధానమంత్రి కిసాన్ పథక లబ్ధి చేకూరాలంటే యూనిక్ నంబర్ తప్పనిసరిగా ఉండాలని జిల్లా వ్యవసాయ జాయింట్ డైరెక్టర్ సత్యవతి తెలిపారు. పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇనాక్టివ్, రిజెక్ట్ అయిన రైతుల వివరాలను సంబంధిత హోం పేజీలో పొందుపరిచి సరిచేసుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు.