News June 7, 2024
నెల్లూరు జిల్లాలో ఎన్నికల కోడ్ తొలగింపు
ఎన్నికల కౌంటింగ్ విజయవంతగా పూర్తవడంతో జిల్లాలో ఎన్నికల కోడ్ గురువారం సాయంత్రంతో ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరినారాయణన్ పేర్కొన్నారు. పూర్తి చిత్తశుద్ధితో పని చేసిన ఎన్నికల సిబ్బందికి, పోలీస్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, విద్యుత్ సిబ్బందికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎస్పీ సమక్షంలో నిర్వహించిన పటిష్ఠ బందోబస్తు వలన ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదని అన్నారు.
Similar News
News December 5, 2024
సోమశిల జలాశయానికి భారీ వరద
సోమశిల జలాశయంలో 71.451 టీఎంసీల నీటిమట్టం నమోదైనట్లు జలాశయ అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో వరద పెరుగుతూ 13,467 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. జలాశయం పూర్తి సామర్థ్యానికి మరో ఆరు టీఎంసీల నుంచి ఏడు టీఎంసీల వరకు కావలసి ఉంది. జలాశయం నుంచి కండలేరు వరద కాలువ ద్వారా కండలేరుకు 2000 క్యూసెక్కులు, స్లూయిస్ ద్వారా 50 క్యూసెక్కుల నీటిని పెన్నా డెల్టాకు విడుదల చేస్తున్నారు.
News December 4, 2024
అల్లూరు: దెయ్యం పేరుతో బురిడీ
అల్లూరు మండలంలో ముగ్గురు వ్యక్తులు ఓ స్వామి మాల ధరించి ఒక వ్యక్తి దగ్గర నుంచి బంగారు నగలు అపహరించారు. అమాయక ప్రజలే టార్గెట్‌గా చేసుకొని ఇంట్లో దెయ్యం ఉందని నమ్మించారు. పూజలు చేస్తే దెయ్యం వెళ్లిపోతుందన్నారు. అనంతరం బాధితుడి నుంచి బంగారు నగలు అపహరించుకొని వెళ్లిపోయారు. దీంతో బాధితుడు స్థానిక అల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
News December 4, 2024
మత్స్యకారుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలేంటి: ఎంపీ వేమిరెడ్డి
దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వివరించాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి బుధవారం కోరారు. లోక్‌సభలో ఆయన మత్స్యకారుల సంక్షేమానికి సంబంధించి పలు ప్రశ్నలు వేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకారుల నైపుణ్యాభివృద్ధికి, శిక్షణ అందించడానికి ప్రభుత్వం ఏదైనా పథకాలను అమలు చేస్తుందా అని ప్రశ్నించారు.