News February 3, 2025

నెల్లూరు జిల్లాలో ఏఎంసీ ఛైర్మన్ పదవులకు రిజర్వేషన్ ఖరారు?

image

నెల్లూరు జిల్లాలో అగ్రికల్చరల్ మార్కెటింగ్ కమిటీ పదవులకు సంబంధించి రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. నెల్లూరుకు సంబంధించి ఓసి జనరల్, కోవూరు ఎస్సీ జనరల్, కందుకూరుకు ఎస్సీ మహిళ, కావలికి బీసీ మహిళ, ఆత్మకూరు బీసీ మైనారిటీ మహిళ, ఉదయగిరి ఓసీ మహిళ, సర్వేపల్లి ఓసీ మహిళకు కేటాయించారు. దాదాపుగా అధికారికంగా కూడా ఇవే ఖరారు కానున్నట్లు తెలుస్తోంది.

Similar News

News February 3, 2025

నెల్లూరు పోలీస్ గ్రీవెన్స్‌కు 95 ఫిర్యాదులు

image

పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను విచారించి చట్టపరంగా న్యాయం చేస్తామని SP జి. కృష్ణ కాంత్ తెలిపారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి 95 ఫిర్యాదులు అందాయని, వాటి పరిష్కారానికి ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.  సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News February 3, 2025

VSUలో కొత్త కోర్సు ఏర్పాటు

image

విక్రమ సింహపురి యూనివర్సిటీలో కొత్తగా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ డొమెస్టిక్ నాన్ వాయిస్ కోర్సు ఏర్పాటు చేసినట్లు స్కిల్ డెవలప్మెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ జే.విజేత తెలిపారు. VSU, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ సంయుక్తంగా ఈ కోర్సు తీసుకురావడం జరిగిందన్నారు. 10వ తరగతి పాసై, 18-25 సం.ల వయస్సు గల అభ్యర్థులు అర్హులు అన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 7వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News February 3, 2025

ప్రజా పాలన కాదు.. పిచ్చి నారాయణ పాలన: కాకాణి

image

వైసీపీ మద్దతుదారుల ఇళ్లను నెల్లూరు మున్సిపల్ కమిషనర్ సూర్య తేజ మంత్రి నారాయణ సూచనలకు అనుగుణంగా ధ్వంసం చేస్తున్నారని మాజీ మంత్రి కాకాణి ఆరోపించారు. వైసీసీ నాయకుడు బాలకృష్ణారెడ్డి ఇంటిని అన్యాయంగా కూల్చారని, ఆయన అక్కడే ఏళ్లుగా ఉన్నారన్నారు. మంత్రి క్షేత్రస్థాయిలో పర్యటిస్తే.. ‘ఇది పిచ్చి నారాయణ పాలన అని ప్రజలే తమ గోడును వెల్లబోసుకుంటారని కాకాణి ఎద్దేవా చేశారు.