News January 28, 2025

నెల్లూరు జిల్లాలో కల్లుగీత కులాల వారికి మద్యం షాపు వివరాలు

image

జిల్లాలో కల్లుగీత కులాల వారికి 18 మద్యం షాపు ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ అయిన విషయం తెలిసిందే. జిల్లాలో నెల్లూరు, కావలి, కందుకూరు, ఆత్మకూరు మున్సిపాలిటీలు, కావలి, కందుకూరు, ఆత్మకూరు మండలాలు, గుడ్లూరు, కలువాయి, జలదంకి, సంగం, కలిగిరి, అనంతసాగరం, వింజమూరు, దుత్తలూరు, లింగసముద్రం, దగదర్తి, ఏఎస్ పేట మండలాలకు కేటాయించారు. దరఖాస్తుదారుడు కుల ధ్రువీకరణతో పాటు రెండు లక్షల రూపాయలు దరఖాస్తు చెల్లించాలన్నారు.

Similar News

News October 13, 2025

నెల్లూరు: రోడ్డు ప్రమాదంలో మాజీ MLA అనుచరుడి మృతి

image

మాజీ MLA కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడు పాలవెల్లి పద్మనాభరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. జాతీయ రహదారిపై ముంగమూరు వద్ద బైక్‌పై వస్తుండగా కారు ఢీకొట్టింది. నెల్లూరులోని ఓ హాస్పిటల్‌కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. అల్లూరులో కాటంరెడ్డి అభిమానులతో కలిసి కావలికి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో కాటంరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

News October 13, 2025

నెల్లూరు: చేపలచెరువులకు ఆగని చికెన్ వ్యర్ధాల తరలింపులు

image

చేపల చెరువుల సాగుల్లో చికెన్ నిర్ధాల తరలింపు జిల్లాలో ఆగడం లేదు. ముఖ్యంగా కోవూరు, సర్వేపల్లి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో సమస్య తీవ్రంగా ఉంది. బుచ్చి, పొదలకూరు, ఆత్మకూరు మండలాల నుంచి నిత్యం వాహనాల్లో చికెన్ వ్యర్ధాలు తరలిస్తున్నారు. కొందరు వారి స్వార్థం కోసం ప్రజల ఆరోగ్యంతో ఆడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఆందోళన చేసినప్పుడు అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు.

News October 13, 2025

కందుకూరు: పేకాట శిబిరంపై దాడి.. 10 మంది అరెస్ట్

image

కందుకూరు (M) కోవూరు గ్రామ శివారులో ఆదివారం రాత్రి గుట్టుగా సాగుతున్న పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. కందుకూరు రూరల్ ఎస్ఐ మహేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని పాత అంగన్‌వాడీ భవనంలో పేకాట ఆడుతున్న సమాచారం పోలీసులకు తెలిసింది. దాంతో ఆకస్మిక దాడి చేయగా 10 మందిని అరెస్ట్ చేసి రూ.6450 నగదును, 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.