News September 11, 2024
నెల్లూరు జిల్లాలో కొండెక్కిన ఉల్లి ధర
నెల్లూరు జిల్లాలో ఉల్లి ధర రోజురోజుకూ పెరుగుతోంది. కిలో రూ.60 నుంచి రూ.70 వరకు విక్రయిస్తుండటంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. కర్ణాటక, పుణే నుంచి దిగుమతి అవుతున్న సరకు.. అక్కడే కిలో రూ.50 వరకు ఉండటంతో రవాణా ఖర్చులతో ఇక్కడికి చేరే సరికి మరింత పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. మహారాష్ట్రలో కొత్త పంట మార్కెట్‌కు రాకపోవడంతో కొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వారు తెలిపారు.
Similar News
News October 12, 2024
నెల్లూరు జిల్లాలో మద్యం షాపులకు 3,833 దరఖాస్తులు
నెల్లూరు జిల్లాలో మద్యం దుకాణాల కోసం గడువు ముగిసే సమయానికి 3,833 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం వరకు అధికారులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. జిల్లాలో మొత్తం 182 మద్యం దుకాణాలు ఏర్పాటు కానున్నాయి. కాగా దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.76.66 కోట్ల ఆదాయం వచ్చినట్లు వారు వెల్లడించారు.
News October 12, 2024
వింజమూరు: రోడ్డు ప్రమాదంలో బ్యాంక్ ఉద్యోగి మృతి
వింజమూరు మండలంలో శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఉదయగిరికి చెందిన APGB బ్యాంక్ ఉద్యోగి షేక్ ఖాజా రహంతుల్లా చనిపోయాడు. చాకలికొండలోని APGB బ్యాంకులో విధులు ముగించుకొని వస్తుండగా మార్గమధ్యలో గేదె అడ్డు వచ్చింది. దీంతో గేదెను తప్పించబోయి అదుపుతప్పి కింద పడ్డారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు.
News October 11, 2024
తడ: ఓ ప్రైవేట్ కంపెనీలో మహిళ దారుణ హత్య..?
తడ మండలం మాంబట్టు సెజ్‌లో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో మహిళ దారుణ హత్యకు గురైనట్లు స్థానికులు తెలిపారు. కంపెనీలో పని చేస్తున్న మహిళను తోటి వర్కర్ కత్తెరతో తల, గొంతుపై తీవ్రంగా దాడి చేశాడు. ఆమెను చెన్నైకి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.