News March 25, 2025

నెల్లూరు జిల్లాలో తగ్గిన ధరలు..?

image

నెల్లూరులో జిల్లాలో వరి కోతలు ప్రారంభం అయ్యాయి. నిరుడు పుట్టి(20 బస్తాలు) రూ.23వేల ధర పలగ్గా.. ఇప్పుడు ఆ ధర రూ.18,500కు తగ్గినట్లు రైతులు తెలిపారు. మరికొన్ని చోట్ల ఈ ధర రూ.16వేల వరకు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం రైతులకు రూ.19వేల మద్దతు ధర చెల్లిస్తుంది. ధరలు పడిపోవడంతో పెట్టుబడులు కూడా రావంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ ఊరిలో ధాన్యం ధరలు ఎలా ఉన్నాయో గ్రామం, మండలంతో కామెంట్ చేయండి.

Similar News

News October 16, 2025

నెల్లూరు: నెల రోజులు ఇండస్ట్రీ పార్ట్నర్ షిప్ డ్రైవ్

image

నెల్లూరు జిల్లాలో బుధవారం నుంచి నెల రోజులు APIICఆధ్వర్యంలో ఇండస్ట్రీ పార్టనర్ షిప్ డ్రైవ్ నిర్వహిస్తామని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. కందుకూరు సబ్ కలెక్టరేట్‌లో సంబంధిత వాల్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. స్థానిక పరిశ్రమల అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, నూతన పెట్టుబడులకు ప్రోత్సాహం, యువతకు ఉపాధి అవకాశాల సృష్టే లక్ష్యంగా డ్రైవ్ జరుగుతుందన్నారు.

News October 16, 2025

నుడా వీసీగా వెంకటేశ్వర్లు

image

నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(నుడా) వైస్ ఛైర్మన్(వీసీ)గా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే ఆయన వీసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. నుడా పరిధిలో పదుల సంఖ్యలో లేఅవుట్లకు అనుమతులు ఆగిపోయాయి. వీసీ నియామకంతో వీటికి మోక్షం లభించే అవకాశముంది.

News October 15, 2025

నెల్లూరులో మరోసారి యూరియా కొరత..?

image

నెల్లూరు జిల్లాలో రైతులకు ఎకరాకు 3బస్తాల చొప్పున యూరియానే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. 6బస్తాలు కావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో 3.50 లక్షల ఎకరాల్లో వరి సాగయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కన 94 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. అధికారులు 74 వేల మెట్రిక్ టన్నులకే ప్రతిపాదనలు పంపారు. 20వేల మెట్రిక్ టన్నుల కొరత ఏర్పడితే యూరియా కోసం రైతులు అవస్థలు పడక తప్పదు.