News February 1, 2025

నెల్లూరు జిల్లాలో తాత్కాలికంగా ఆగిన పెన్షన్ పంపిణీ 

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం పెన్షన్ల పంపిణీ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. అయితే పలు ప్రాంతాలలో సర్వర్ సమస్యల వల్ల పెన్షన్ల పంపిణీ ఆగినట్లు స్థానికుల తెలిపారు. అల్లూరు మండలంలోని పురిని, ఇందుపూరు తదితర ప్రాంతాల్లో సర్వర్ తాత్కాలికంగా ఆగిపోయింది. లబ్ధిదారులు పెన్షన్ నగదు కోసం ఎదురుచూస్తున్నారు. మీ ప్రాంతంలో కూడా ఇలానే ఉందా.?

Similar News

News March 11, 2026

నెల్లూరు: నారా లోకేశ్ పర్యటనలో మార్పులు

image

మంత్రి నారా లోకేశ్ ఈనెల 12న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఆరోజు మధ్యాహ్నం 12:45 గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి మధ్యాహ్నం 3.45 గంటలకు బోగోలు మండలం జువ్వలదిన్నెకు చేరుకుంటారు. సాయంత్రం 4.30 గంటలకు జువ్వలదిన్నె వద్ద జరిగే సాగర్ డిఫెన్స్ ఫౌండేషన్ స్టోన్ ఫౌండేషన్‌లో పాల్గొంటారు.

News March 11, 2026

నెల్లూరు: KGBVలలో అడ్మిషన్ల ప్రారంభం

image

నెల్లూరు జిల్లాలోని 12 KGBVల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష APC వెంకటసుబ్బయ్య తెలిపారు. 6వ తరగతిలో 40, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 40 సీట్లు ఉన్నాయన్నారు. 7 నుంచి 10వ తరగతి, ఇంటర్ సెకండ్ ఇయర్‌లో మిగిలిన సీట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనాథ, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్, పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బాలికలే అర్హులని చెప్పారు. apkgbv.apcfss.in ద్వారా అప్లికేషన్లు పొందాలి.

News March 11, 2026

నెల్లూరు జిల్లాలో గ్యాస్ కష్టాలు..!

image

యుద్ధం ఎఫెక్ట్‌తో నెల్లూరు జిల్లాలో గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. బుచ్చి మండలంలో గతంలో బుకింగ్ చేసిన 24 గంటల్లో డెలీవరీ చేస్తుండగా.. ఇఫ్పుడు రెండు రోజులకూ ఇవ్వడం లేదు. బ్లాక్‌లో విక్రయించుకునేందుకు డీలర్లు కొరత సృష్టిస్తున్నారని ప్రజలు అనుమానిస్తున్నారు. సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సకాలంలో సిలిండర్ అందేలా చూడాలని కోరుతున్నారు. మీ ఏరియాలో పరిస్థితి ఏంటో కామెంట్ చేయండి.