News June 5, 2024

నెల్లూరు జిల్లాలో తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టేది వీరే..!

image

నెల్లూరు జిల్లాలో పది స్థానాల్లో టీడీపీ గెలిచింది. ఇందులో నలుగురు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఉన్నారు. గెలిచిన పది మందిలో ఇద్దరు మహిళలు కాగా.. తొలిసారి వీరు అధ్యక్షా.. అననుండడం విశేషం.

Similar News

News November 24, 2025

VPR దంపతులను కలిసిన జడ్పీ సీఈవో

image

నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులను నూతన జడ్పీ సీఈవో శ్రీధర్‌రెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ఆయన్ను జిల్లా పరిషత్‌కు కొత్త సీఈవోగా ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో నగరంలోని వీపీఆర్‌ నివాసానికి వచ్చిన ఆయన వేమిరెడ్డి దంపతులను కలిసి బొకే అందించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని వేమిరెడ్డి సూచించారు.

News November 24, 2025

కాసేపట్లో నెల్లూరుకు మంత్రి సత్యకుమార్ రాక

image

మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈనెల మంగళవారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఇవాళ రాత్రి 9 గంటలకు నెల్లూరుకు చేరుకుంటారన్నారు. రాత్రికి ఇక్కడే బస చేసి మరుసటి రోజు ఉదయం విలుకానిపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు.. సాయంత్రం వరకు అక్కడే కార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు.