News June 5, 2024

నెల్లూరు జిల్లాలో తొలిసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టేది వీరే..!

image

నెల్లూరు జిల్లాలో పది స్థానాల్లో టీడీపీ గెలిచింది. ఇందులో నలుగురు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఉన్నారు. గెలిచిన పది మందిలో ఇద్దరు మహిళలు కాగా.. తొలిసారి వీరు అధ్యక్షా.. అననుండడం విశేషం.

Similar News

News December 1, 2024

కొండాపురం: హత్య చేసిన నిందితుడు అరెస్ట్

image

కొండాపురం మండలం గానుగపెంటలో బంకా తిరుపాలు అనే మేకల కాపరిని హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కావలి డీఎస్పీ శ్రీధర్ ఆదివారం వివరాలు వెల్లడించారు. గానుగపెంటలో బుధవారం బాంకా తిరుపాలు హత్యకు గురయ్యాడు. పశువులు కాస్తున్న మాల్యాద్రి(మల్లి) ఈ హత్య చేసినట్లు విచారణలో తేలిందన్నారు. తిరుపాలుకు చెందిన మేకలను అక్రమంగా అమ్ముకుని సొమ్ము చేసుకోవాలని ఆశతోనే ఈ హత్య చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

News December 1, 2024

నెల్లూరు జిల్లాలో పలు బస్సులు రద్దు

image

నెల్లూరు జిల్లాలో భారీవర్షాల నేపథ్యంలో పలు బస్సు సర్వీసులను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. నెల్లూరు రీజియన్ పరిధిలో ఆత్మకూరు, ఉదయగిరి, నెల్లూరు నుంచి చెన్నైకు ప్రతి రోజూ 18 బస్సులు నడుస్తుండగా వాటిని రద్దు చేశామన్నారు. మరోవైపు కావలి నుంచి తుమ్ములపెంట దారిలో కాలువకు గండి పడటంతో ఆ దారిలో వెళ్లే బస్సులను సైతం రద్దు చేశామన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News December 1, 2024

నెల్లూరులో హెల్ప్ లైన్ నంబర్లు ఇవే 

image

నెల్లూరు నగర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవసరమైన సహాయక చర్యలను అందించేందుకు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ ఆదేశాలు జారీ చేశారు. విపత్తు సహాయక బృందాలు తక్షణమే విధులకు హాజరుకావాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లోని వరద బాధితులు తమ సమస్యలను 9494018118 నంబరుకు వాట్సప్ ద్వారా లేదా 0861-2356777 & 0861-2316777 నంబర్లను సంప్రదించాలన్నారు.