News October 9, 2024
నెల్లూరు జిల్లాలో త్వరలో ఎన్నికలు: కలెక్టర్

నెల్లూరు జిల్లాలో త్వరలో సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఒ.ఆనంద్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇరు శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేసి ఓటరు జాబితా తయారు చేయాలని కోరారు. రెవెన్యూలో ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ల మంజూరు, మ్యూటేషన్ ట్రాన్సాక్షన్లపై తహశీల్దార్లు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.
Similar News
News December 9, 2025
నెల్లూరు: “సాదా బైనామాల”కు సదావకాశం

తెల్ల కాగితాలపై చేసుకున్న పొలాల కొనుగోలు ఒప్పంద పత్రాలకు మోక్షం కలగనుంది. సాదా బైనామాల కింద ఉన్న వీటి వలన పొలాలకు యాజమాన్య హక్కులు లేక, విక్రయించుకోలేక, ప్రభుత్వ పథకాలకు నోచుకోలేని పరిస్థితి. ఇలాంటివి సుమారు 18 వేల వరకు ఉన్నట్లు అంచనా. MRO లు క్షేత్రస్థాయిలో పరిశీలించి 90 రోజుల్లో పరిష్కరించేలా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. చిన్న, సన్నకారు రైతులకు మంచి రోజులు రానున్నాయి.

గంటల వ్యవధిలో నిందితులను అరెస్ట్ చేసిన నెల్లూరు పోలీసులు

నగరంలో నిన్న సాయంత్రం బోసు బొమ్మ వద్ద రోడ్డుకు అడ్డంగా ఉన్న బైక్ను తీయమన్నందుకు సిటీ బస్సు డ్రైవర్, కండక్టర్పై బ్లేడ్తో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఐదుగురు నిందితులను సంతపేట పోలీసులు గంటల వ్యవధిలో అరెస్ట్ చేశారు. పోలీసులు మాట్లాడుతూ.. నిందితులకు నేర చరిత్ర లేదని, క్షణికావేశంలో ఈ ఘటన జరిగిందన్నారు. చాకచక్యంగా వ్యవహరించిన పోలీసుల తీరుపట్ల నగరవాసులు అభినందనలు తెలిపారు.