News April 10, 2025

నెల్లూరు జిల్లాలో దారుణం

image

నెల్లూరు జిల్లా ఊటుకూరు పెద్దపట్టపుపాళెంలో దారుణం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. వరకట్నం కోసం సుగుణమ్మను వివస్త్రని చేసి భర్త, అత్తమామలు, ఆడబిడ్డ దాడి చేశారు. ఈ విషయం బయటకొస్తుందని ఆపై కొట్టి చంపేశారు. కళ్లాపి రంగు తాగి ఆత్మహత్య చేసుకుందని హైడ్రామా సృష్టించారు. భర్త హరికృష్ణ, అత్తమామలు నాగూర్, నర్సమ్మ, ఆడబిడ్డ నాగలక్ష్మి పరారయ్యారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Similar News

News November 18, 2025

తోటపల్లి: ఇంటిని లాక్కొని బెదిరిస్తున్నారని ఫిర్యాదు.!

image

నల్లూరు జిల్లా తోటపల్లి గూడూరుకి చెందిన తన ఇంటిని లాక్కొని అల్లుడు బెదిరిస్తున్నారని వృద్ధుడు సోమవారం పోలీస్ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. తన పెద్ద అల్లుడు శ్రీనివాసులురెడ్డి ఇంటికి తాళంవేసి, ఇంటి నుంచి తరిమేసి చంపుతానని బెదిరిస్తున్నాడన్నారు. తనకు మగ పిల్లలులేరని, ఇద్దరు ఆడపిల్లలని, భార్య చనిపోయారని, విచారించి త్వరితగతిన న్యాయం చేయాలని కోరారు.

News November 17, 2025

నెల్లూరు: సదరం.. నాట్ ఓపెన్..!

image

వికలాంగత్వ ధ్రువీకరణ కోసం తీసుకొచ్చిన “సదరం” సైట్ ఓపెన్ కావడం లేదు. ఈనెల 14 న సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినా.. రెండు రోజులకే మూతపడింది. అదేమిటంటే ఒకసారి స్లాట్స్ అయిపోయాయని చెప్పుకొచ్చారు. వెయిటింగ్ లిస్ట్ కింద అయినా దరఖాస్తు చేసుకుందామని ప్రయత్నం చేయగా.. సైట్ క్లోజ్ అయిపొయింది. ఇదేమి విచిత్రమని ప్రజలు వాపోతున్నారు. ఏడాది నుంచి ఇవే తిప్పలు ఎదురవుతున్నాయి.