News November 2, 2024
నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు

నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు 30 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని సివిల్ సప్లయిస్ సంస్థ డీఎం నర్సింహరావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ 37,978 ఎకరాల్లో వరి సాగు చేశారని చెప్పారు. 1,29,583 టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు నివేదికలు ఇచ్చారన్నారు. ప్రభుత్వం 2024-25 సీజన్‌కు గ్రేడ్-ఏ రకానికి రూ.2,320, సాధారణ రకానికి రూ.2,300 మద్దతు ధరగా ప్రకటించిందన్నారు.
Similar News
News February 9, 2026
వెట్టి చాకిరి నిర్మూలన పోస్టర్లు ఆవిష్కరించిన కలెక్టర్, ఎస్పీ

వెట్టి చాకిరి నిర్మూలన చట్టానికి సంబంధించిన పోస్టర్‌ను కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ డా అజిత వేజెండ్ల ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. వెట్టి చాకిరి వంటి అమానుషమైన ఆచారాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు రూపొందించిన వెట్టి చాకిరి నిర్మూలన చట్టము- 1976 అమల్లోకి వచ్చి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఫిబ్రవరి 09 తేదీని వెట్టి చాకిరి నిర్మూలన దినంగా పాటించబడిందన్నారు.
News February 9, 2026
నెల్లూరు: CIపై ఆరోపణలు.. కానిస్టేబుల్ సస్పెండ్

తనను ఉదయగిరి సీఐ N.వెంకట్రావు <<19088594>>వేధిస్తున్నారని <<>>సీతారామపురం మహిళా కానిస్టేబుల్ జ్యోతి ఆరోపించిన విషయం తెలిసిందే. ఆమెకు నెల్లూరు ఎస్పీ అజిత వేజెండ్ల షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆమెను సస్పెండ్ చేశారు. ‘ఉన్నతాధికారి పర్మిషన్ లేకుండా ప్రెస్‌మీట్ నిర్వహించడం రూల్స్‌కు విరుద్ధం. సీఐపై నిరాధార ఆరోపణలు చేశారు. క్రమశిక్షణ చర్యల కింద ఆమెను సస్పెండ్ చేశాం’ అని SP పేర్కొన్నారు.
News February 9, 2026
CM సమీక్షకు నెల్లూరు కలెక్టర్ హాజరు

అమరావతి సచివాలయం నుంచి మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. నెల్లూరు కలెక్టరేట్ నుంచి వర్చువల్‌గా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ డా.అజితా వెజండ్ల, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. GDP వృద్ధిరేటు, RTGS, ప్రాజెక్టుల పురోగతి.. సంక్షేమ కార్యక్రమాల అమలు, స్వర్ణాంధ్ర విజన్ 2047, లా అండ్ ఆర్డర్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు.


