News October 16, 2024
నెల్లూరు జిల్లాలో పనిచేసిన ఎస్సై సస్పెండ్

గతంలో వెంకటాచలంలో పనిచేసి ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న ఎస్ఐ కరీముల్లా సస్పెన్షన్‌కు గురయ్యారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వేశ్వర త్రిపాఠి మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వంలో వెంకటాచలం ఎస్ఐగా కరీముల్లా పనిచేస్తున్న సమయంలో ఓ కేసుకు సంబంధించి 800 గ్రాముల బంగారాన్ని సీజ్ చేశారు. అయితే ఈ బంగారం స్టేషన్ నుంచి మాయం చేసిన కేసులో ఎస్సై కరిముల్లా సస్పెండ్ అయ్యారు.
Similar News
News February 26, 2026
నెల్లూరులో కొత్త మోసం.. జాగ్రత్త!

ఆన్‌లైన్ దోపిడీకి సైబర్ నేరగాళ్లు మరో కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టారు. RTO ఆఫీస్ చలానా పేరుతో వాట్సాప్‌కు APK ఫైల్స్ పంపిస్తున్నారు. నెల్లూరులో కొందరు వీటిని క్లిక్ చేశారు. వారి నుంచి స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఏపీకే ఫైల్ ఆటోమేటిక్‌గా ఫార్వర్డ్ అవుతోంది. ఇలాంటి వాటిని క్లిక్ చేస్తే నగదు దోచేస్తారని.. జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
News February 26, 2026
నెల్లూరు: ఒక్కరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ

ఈ నెల పింఛన్లను ఒక్క రోజు ముందుగానే ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. మార్చి నెల ఒకటో తేదీన ఆదివారం రావడంతో ఫిబ్రవరి 28న పింఛన్ నగదును పంపిణీ చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 289647 పింఛన్లకు సంబంధించి రూ.126.91 కోట్లను అందజేస్తున్నట్లు DRDA పీడీ నాగరాజకుమారి తెలిపారు.
News February 26, 2026
NLR: గురుకులాల ప్రవేశ పరీక్ష వాయిదా

గురుకులాల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి మార్చి 2న ప్రవేశ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అదే నెల 8వ తేదీకి వాయిదా వేసినట్లు ఆ సంస్థ నెల్లూరు జిల్లా సమన్వయకర్త ప్రభావతమ్మ ఓ ప్రకటనలో తెలిపారు. 9వ తరగతి విద్యార్థులకు ఎస్ఏ 2 పరీక్షలను నిర్వహిస్తున్న నేపథ్యంలో వారి సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.


