News February 19, 2025
నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా ఇంటర్ ప్రాక్టికల్స్

నెల్లూరు జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు 9వ రోజు మంగళవారం ప్రశాంతంగా జరిగాయని ఆర్ఐవో డాక్టర్ ఎ.శ్రీనివాసులు తెలిపారు. తాను 2 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసినట్లు చెప్పారు. జిల్లా ఓకేషనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ 3 కేంద్రాలను, జిల్లా పరీక్షల కమిటీ 5 కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్ 8 కేంద్రాలను చెక్ చేసిందన్నారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ జరగలేదని తెలిపారు. 51 మంది ప్రాక్టికల్స్‌కు రాలేదన్నారు.
Similar News
News April 10, 2026
నెల్లూరు: ఫొన్ కాల్‌తో ప్రాణాలను కాపాడిన పోలీసులు

కుటుంబ కలహాల నేపథ్యంలో దగదర్తి మండలం తురుమెళ్ల పంచాయతీ లక్ష్మి నరసాపురం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తెలిపాడు. కుటుంబ సభ్యులు 112 కి కాల్ చేసి సమాచారం అందించారు. వెంటనే దగదర్తి ఎస్సై జంపాని కుమార్ తమ సిబ్బందిని అప్రమత్తం చేసి ఆత్మహత్యకు యత్నిస్తున్న వ్యక్తిని మొబైల్ నంబర్, లొకేషన్ ఆధారంగా కనుగొని అతని ప్రాణాలను కాపాడారు.
News April 10, 2026
ఆత్మకూరు: రూటు మార్చి అక్రమ రవాణా..!

అక్రమ రవాణాదారులు నిషేధిత చికెన్ వ్యర్థాలను బహిరంగంగానే తరలిస్తూ అధికారులకు సవాల్ విసురుతున్నారు. ఎన్నిసార్లు దాడులు చేసి కేసులు పెట్టినా అక్రమ రవాణా ఆపడం లేదు. బద్వేల్ నుంచి వస్తున్న వాహనాలు దారి మార్చాయి. హైవేను తప్పించి అనంతసాగరం మండలంలోని పల్లెల మీదుగా రొయ్యల, చేపల గుంటలకు ఈ వ్యర్థాలు తరలిస్తున్నారు.
News April 10, 2026
వరల్డ్ టాప్-2%లో నెల్లూరు శాస్త్రవేత్త

ప్రపంచ టాప్ 2% శాస్త్రవేత్తల జాబితాలో వరుసగా ఐదోసారి నెల్లూరు శాస్త్రవేత్త డాక్టర్ అనుముకొండ వరదరాజులు చోటు సంపాదించారు. ఆయనను జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు సత్కరించారు. 75 ఏళ్ల వయసులో పసుపు, గోమూత్రం వంటి ప్రకృతి సిద్ధ పదార్థాలతో క్యాన్సర్ కణాలను నిరోధించే ‘నానో-మెడిసిన్’పై ఆయన పరిశోధనలు చేస్తున్నారు. ఆయన సాధించిన అంతర్జాతీయ పేటెంట్లు జిల్లాకు గర్వకారణమని జేసీ కొనియాడారు.


