News February 26, 2026

నెల్లూరు జిల్లాలో ముమ్మరంగా పాల తనిఖీలు

image

రాజమండ్రి కల్తీ పాల ఘటన నేపథ్యంలో జిల్లాలో 4 రోజుల నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. ప్రభుత్వం పాల నాణ్యతను నిర్ధారించేందుకు మాజిక్ బాక్స్‌ను కేటాయించింది. దీంతో అక్కడికక్కడే పాల కల్తీని గుర్తించవచ్చు. జిల్లాలో100 వరకు డెయిరీలు ఉన్నాయని, వీటిల్లో ర్యాండమ్‌గా తనిఖీలు చేస్తున్నట్లు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వెంకటేశ్వర రావు Way2Newsకు వివరించారు.

Similar News

News April 15, 2026

నెల్లూరు జిల్లాకు జగన్.. టెన్షన్ టెన్షన్

image

నెల్లూరు జిల్లాలో YCP అధినేత జగన్ ఇవాళ పర్యటించనున్నారు. ఉదయం 9గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరుతారు. ఉదయం 10.30గంటలకు జువ్వలదిన్నె సమీపంలోని హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ముందుగా హార్బర్‌ను పరిశీలించి తర్వాత మత్స్యకారులతో సమావేశమవుతారు. జగన్ పర్యటనకు వెళ్తే రూ.లక్ష జరిమానా వేస్తామని కొన్ని మత్స్యకార గ్రామాలు దురాయి వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ పర్యటన ఉత్కంఠ రేపుతోంది.

News April 14, 2026

విద్యార్థులు, తల్లిదండ్రులకు జిల్లా ఇంటర్ RIO కీలక సూచనలు

image

రేపు ఇంటర్ ఫలితాలు విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఫలితాల అనంతరం విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వారికి ధైర్యం చెప్పాలని జిల్లా ఇంటర్ RIO అధికారి వరప్రసాదరావు సూచించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఎటువంటి అవమానాలకు లోను కాకుండా ధైర్యంగా తదుపరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు.

News April 14, 2026

రేపే రిజల్ట్స్.. నెల్లూరు జిల్లాలో 53,404 మంది వెయిటింగ్

image

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం ఉదయం 10:31 గంటలకు విడుదల కానున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో రెగ్యులర్, ఒకేషనల్ కలిపి 26,935 మంది, ద్వితీయ సంవత్సరంలో రెగ్యులర్, ఒకేషనల్ కలిపి 26,469 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను Way2News యాప్‌లో చూసుకోవచ్చు.