News February 18, 2025

నెల్లూరు జిల్లాలో రిపోర్టర్లు కావలెను

image

నెల్లూరు జిల్లా పరిధిలో పనిచేయడానికి Way2News రిపోర్టర్లను ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వాళ్లు మాత్రమే అర్హులు. ప్రస్తుతం ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లు సైతం మాకు వార్తలు రాయడానికి అర్హులు అవుతారు. ఆసక్తి ఉన్నవారు ఈ <>లింకుపై<<>> క్లిక్ చేసి మీ పేరు, మండలం పేరు, పనిచేసిన సంస్థ పేరు నమోదు చేయండి.

Similar News

News April 16, 2026

ఈనెల 20 నుంచి ఇంటర్ పరీక్ష రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్

image

ఇంటర్ పరీక్ష ఫలితాలకు సంబంధించి రీకౌంటింగ్ రీ వెరిఫికేషన్‌కు అభ్యర్థులు అప్లై చేసుకోవాలని ఆర్‌ఐవో వరప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు రీకౌంటింగ్‌కు ఒక పరీక్షా పత్రానికి రూ.260, రీ వెరిఫికేషన్‌కు రూ.1300 రుసుము చెల్లించాలన్నారు. అభ్యర్థులు ఈనెల 27 తేదీ లోపు అప్లై చేసుకోవాలన్నారు. అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత విద్యాశాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు.

News April 15, 2026

1,250 మెకనైజడ్ బోట్లను ఇవ్వాలనుకున్నాం: YS జగన్

image

తాము జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో 1,250 మెకనైజడ్ బోట్లకు సదుపాయం కలిగేలా నిర్మాణం చేపట్టామని మాజీ CM జగన్ అన్నారు. ఆ బోట్లను కేవలం 10% మత్స్యకారులు కట్టుకుంటే, 40% రాయితీ ఇచ్చి, మిగిలిన దాన్ని లోన్ రూపంలో అందించే వాళ్లమన్నారు. అదే జరిగితే ఇప్పటికి 15 మంది మత్స్యకారులు ఆ బోట్లకు యజమానులై ఉండేవారన్నారు. కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, ఐస్ ప్లాంట్లు నడిచేవని, బోట్ల రిపేరు యూనిట్లు పనిచేసేవన్నారు.

News April 15, 2026

సీజ్ చేసిన బంగారాన్ని వదులుతారా చంద్రబాబు: YS జగన్

image

‘సీజ్ చేసిన బంగారాన్ని మీ ప్రభుత్వం విడుదల చేస్తుందా.. అలాంటప్పుడు సీజ్ చేసిన బోట్లను ఏవిధంగా వదిలి పెడతారు’ అని CM చంద్రబాబును మాజీ CM జగన్ జువ్వలదిన్నెలో ప్రశ్నించారు. మత్స్యకారుల గురించి ఏనాడు చంద్రబాబు ఆలోచించలేదన్నారు. తాము బ్లూ రేవల్యూషన్ పెంచేందుకు ప్రతి 50 కీ.మీ లకు హార్భర్‌లను తీసుకోచ్చమన్నారు. ఫిషింగ్ హార్భర్‌ను జాతికి అంకితం చేస్తే.. ఇప్పటి వరకు మత్స్యకారులకు ఎందుకు ఇవ్వలేదని ఆరోపించారు