News October 15, 2024

నెల్లూరు జిల్లాలో రేపు సెలవు

image

నెల్లూరు జిల్లాలో బుధవారం కూడా భారీ వర్షాలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని పాఠశాలలు, కళాశాలలకు బుధవారం కూడా సెలవు ప్రకటించారు. 72 గంటల పాటు భారీ వర్షాలు ఉంటాయని.. అవసరమైతే తప్ప బయటకు రావద్దని కలెక్టర్ సూచించారు. పెన్నా బ్రిడ్జికి పడిన గండిని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.

Similar News

News January 10, 2026

నెల్లూరు: భారీ పరిశ్రమ.. వెయ్యి ఉద్యోగాలు

image

నెల్లూరు జిల్లాలోని ఇఫ్కో సెజ్‌లో భారీ పరిశ్రమ రానుంది. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ రూ. 6,675 కోట్లతో 200 ఎకరాల్లో ఇంగోట్, వేఫర్ల తయారీ యూనిట్ పెట్టనుంది. దీని ద్వారా 1000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ప్రాజెక్ట్ కోసం 200 మెగా వాట్ల సోలార్ ప్లాంట్ సైతం నెలకొల్పనున్నారు. కనిగిరి రిజర్వాయర్ నుంచి రోజుకు 12.6మిలియన్ లీటర్ల నీటిని కేటాయిస్తారు. 6నెలల్లోనే భూముల కేటాయిపు పూర్తి చేస్తారు.

News January 10, 2026

నెల్లూరు: నేటి నుంచి సంక్రాంతి సెలవులు

image

జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు శనివారం నుంచి ఈ నెల 18 వరకు సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లు డీఈఓ డా. ఆర్ బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. సెలవుల్లో తరగతులను నిర్వహిస్తే ప్రభుత్వ నిబంధనల మేరకు సదరు పాఠశాలలపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. అన్ని యాజమాన్య పాఠశాల కళాశాల సిబ్బంది సహకరించాలని కోరారు.

News January 10, 2026

నెల్లూరులో వర్షాలు.. నంబర్లు సేవ్ చేసుకోండి

image

అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజల సహాయార్థం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఏమైనా సహాయం కావాలంటే ప్రజలు కంట్రోల్ రూము నెంబర్లు 0861-2331261, 7995576699 /1077 సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.