News September 10, 2024
నెల్లూరు జిల్లాలో ర్యాట్ ఫీవర్?
అల్లూరుకు చెందిన వ్యక్తి ర్యాట్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. అతనికి వైరల్ ఫీవర్ ఎక్కువవ్వడంతో చెన్నైలో వైద్యం చేయించుకున్నారు. ఆదివారం మళ్లీ అనారోగ్యానికి గురవ్వగా నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. దీనిపై అల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వరావు వివరణ ఇచ్చారు. ర్యాట్ ఫీవర్ ప్రాణాంతకమని, తాగేనీటిలో ఎలుకలు, పందికొక్కులు మూత్ర విసర్జన చేయడం వలన ఆ వ్యాధి సోకుతుందన్నారు.
Similar News
News October 16, 2024
అక్షరాస్యతతోనే అభివృద్ధి: నెల్లూరు కలెక్టర్
అక్షరాస్యతతోనే అన్ని రంగాలలో అభివృద్ధి సాధ్యమని కలెక్టర్ ఆనంద్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘ఉల్లాస్’ కార్యక్రమానికి సంబంధించి జిల్లా స్థాయి అధికారులతో మంగళవారం కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఉల్లాస్ కార్యక్రమం
ద్వారా జిల్లాలో 19,178 మంది నిరక్షరాస్యులను అభ్యాసకులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
News October 16, 2024
నెల్లూరు జిల్లాలో విద్యుత్ కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవే..
నెల్లూరు జిల్లాలోని ఏడు డివిజన్ల విద్యుత్ భవన్‌లలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్ విజయన్ తెలిపారు.
వాటి వివరాలు
➥ నాయుడుపేట-7382623178
➥గూడూరు-7901036852
➥నెల్లూరురూరల్-9381815083
➥నెల్లూరుటౌన్-7901642857
➥ కోవూరు-9705200708
➥కావలి-7901056437
➥ఆత్మకూరు-7901056906
➥విద్యుత్ భవన్-9440817468
అత్యవసరాలల్లో ప్రజలు ఈ నం.కు ఫోన్ చేయాలన్నారు.
News October 15, 2024
నెల్లూరు జిల్లాలో రేపు సెలవు
నెల్లూరు జిల్లాలో బుధవారం కూడా భారీ వర్షాలు పడనున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఆనంద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని పాఠశాలలు, కళాశాలలకు బుధవారం కూడా సెలవు ప్రకటించారు. 72 గంటల పాటు భారీ వర్షాలు ఉంటాయని.. అవసరమైతే తప్ప బయటకు రావద్దని కలెక్టర్ సూచించారు. పెన్నా బ్రిడ్జికి పడిన గండిని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు.