News April 3, 2025

నెల్లూరు జిల్లాలో విషాదం

image

బడికి వెళ్లి చదువుకోవాల్సిన ఆ చిన్నారికి ఏ కష్టం వచ్చిందో ఏమో. 6వ తరగతికే ఈ జీవితం చాలు అనుకుంది. 11 ఏళ్ల ప్రాయంలోనే బలవనర్మణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది. ఆత్మకూరు పట్టణంలోని వందూరుగుంటకు చెందిన బాలిక(11) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతోంది. ఈక్రమంలో ఇవాళ ఇంట్లోని బాత్ రూములో ఉరేసుకుంది. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Similar News

News April 18, 2025

నెల్లూరులోనూ వెయ్యేళ్ల నాటి కట్టడాలు

image

నెల్లూరులోని తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానం అతి పురాతనమైంది. దీనిని క్రీ.శ 7, 8వ శతాబ్దంలోనే సింహపురిని ఏలిన పల్లవ రాజులు దీనిని నిర్మించారు. ఆ తర్వాత రాజరాజనరేంద్రుడు, కుళోత్తుంగ చోళుడు దీనిని అభివృద్ధి చేశారు. 95 అడుగుల పొడవుతో ఆలయ గాలిగోపురం ఉండటం విశేషం. అలాగే ఉదయగిరి కోటకు వెయ్యేళ్ల చరిత్ర ఉంది. ఇలాంటి కట్టడాలు నెల్లూరు జిల్లాలో చాలా ఉన్నాయి. నేడు World Heritage Day.

News April 18, 2025

నెల్లూరు: సచివాలయంలో రాసలీలలు..?

image

నెల్లూరు మినీ బైపాస్ రోడ్డును ఆనుకుని ఉన్న ఓ సచివాలయాన్ని అక్కడ పనిచేసే సిబ్బంది తమ రాసలీలలకు వాడుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్ఐ, మహిళా అడ్మిన్ నిర్ణీత సమయాని కంటే ముందుగానే సచివాలయానికి వచ్చి రాసలీలల్లో మునిగి తేలుతున్నారని సమాచారం. ఇటీవల వీరిద్దరిని స్థానికులు మందలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై నెల్లూరు కార్పొరేషన్ అధికారులు రహస్యంగా విచారిస్తున్నారని సమాచారం.

News April 18, 2025

నెల్లూరు ప్రజలకు పోలీసుల కీలక సూచన

image

నెల్లూరు జిల్లా ప్రజలకు పోలీసులు కీలక సూచన చేశారు. వైట్ షిఫ్ట్ కారులో కొంతమంది వ్యక్తులు ఊరి వెలుపల ఉండి ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. కావలి పట్టణంలో ఇదే తరహాలో ఊరు చివర కారు పెట్టుకుని ఐదు చోట్ల దొంగతనాలు చేశారు. వైట్ షిఫ్ట్ కారు ఊరి శివారు ఏరియాలో ఉంటే వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు.

error: Content is protected !!