News June 4, 2024

నెల్లూరు జిల్లాలో వైసీపీకి షాక్

image

5 రౌండ్లు ముగిసేసరికి నెల్లూరుజిల్లా వ్యాప్తంగా ఫలితాలు ఇలా ఉన్నాయి. నెల్లూరు సిటీలో నారాయణ 7వేలు, రూరల్‌లో కోటంరెడ్డి 5వేలు పైచిలుకు, కావలిలో కావ్యకి 7000 పైచిలుకు, సర్వేపల్లిలో సోమిరెడ్డికి 1500పై మెజార్టీ, ఆత్మకూరులో విక్రం రెడ్డికి 1500 ఓట్ల ముందంజ, ఉదయగిరిలో రాజగోపాల్ రెడ్డి 600 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. గూడూరులో సునీల్, వెంకటగిరిలో కురుగోండ్ల, పేటలో విజయశ్రీ లీడ్‌లో ఉన్నారు.

Similar News

News November 14, 2024

కోట: గురుకులానికి వారం రోజులు సెలవులు

image

తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్‌లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే AP బీసీ బాలికల గురుకుల పాఠశాలకు వారం రోజులు సెలవు ప్రకటించినట్లు ఆ పాఠశాల కన్వీనర్ నారాయణరావు బుధవారం పేర్కొన్నారు. ఈ భవనంలోని గదులు కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రమాదకరంగా మారాయన్నారు. దీంతో భవనాలకు మరమ్మతులు చేపట్టామన్నారు. అందుకే సెలవులు ప్రకటించామన్నారు.

News November 14, 2024

పెంచలకోనలో వైభవంగా నరసింహుని ఉత్సవం 

image

నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో బుధవారం ద్వాదశి సందర్భంగా శ్రీవార్లకు నందనవనంలో అష్టోత్తర శత కలశాభిషేకం, సాలగ్రామ దాత్రి పూజలు నిర్వహించి వనభోజనాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారికి బంగారు గరుడ వాహనంపై వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా ఉత్సవం జరిపారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ పోరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. 

News November 13, 2024

నెల్లూరు: వందే భారత్ రైలు ఢీకొని మహిళ మృతి

image

కోవూరు మండలం పడుగుపాడు రైల్వే గేట్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. లేగుంటపాడు గ్రామానికి చెందిన సరోజమ్మ(65) రైల్వే గేటు దాటుతుండగా తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్న వందే భారత్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.