News August 7, 2024

నెల్లూరు జిల్లాలో 1.20 లక్షల కుటుంబాలకు జీవనోపాధి

image

కేంద్ర ప్రభుత్వానికి చెందిన లక్బద్ దీది కార్యక్రమం ద్వారా జిల్లాలో 1.20 లక్షల కుటుంబాలకు జీవనోపాధి కల్పించాల్సిన అవసరం ఉందని డీఆర్‌డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కేవీ సాంబశివారెడ్డి పేర్కొన్నారు. ఏజీఎంలు, ఏపీఎంలు, ఏసీలు, సీసీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. లక్బద్ దీదీ కార్యక్రమానికి సంబంధించి జిల్లాలో 1.20 లక్షల కుటుంబాలకు జీవనోపాధులు కల్పించాల్సి ఉందన్నారు.

Similar News

News December 13, 2024

గూడూరు: డాక్టర్ వేధిస్తున్నారంటూ ఫిర్యాదు

image

వాకాడు మండలం నిడిగుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ వైద్యాధికారి వేధిస్తున్నారంటూ పలువురు మహిళా ఉద్యోగుల ఆరోపించారు. ఈ మేరకు వారు గురువారం సాయంత్రం గూడూరు డీఎస్పీతోపాటూ విజయవాడలోని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌కు లికిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిందితుడిపై విచారణ చేపట్టి కఠిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. 

News December 13, 2024

ఏపీలో పౌర విమానయానం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు ఏమిటి: వేమిరెడ్డి

image

ఏపీలో పౌర విమానయానం అభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఏమిటి అని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురువారం పార్లమెంటులో ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపాదించిన విమానాశ్రయాలు పూర్తి చేయడానికి పట్టే సమయాన్ని తెలియజేయాలన్నారు. ఏవియేషన్ ప్రాజెక్టుల ప్రయోజనం కోసం కేటాయించిన నిధులను తెలియజేయాలన్నారు. సహాయ మంత్రి మురళీధర్ సమాధానమిచ్చారు.

News December 12, 2024

సెలవు ఇవ్వకపోతే కఠిన చర్యలు: తిరుపతి జేసీ

image

భారీ వర్షాల కారణంగా తిరుపతి జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శుభం బన్సల్ శుక్రవారం సెలవు ప్రకటించారు. ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గూడూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాలతో పాటు వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లె మండలాలకు మాత్రమే సెలవు వర్తిస్తుంది. నెల్లూరు జిల్లాలో సెలవుపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.