News March 17, 2025

నెల్లూరు జిల్లాలో 144 సెక్షన్ అమలు

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మరికాసేపట్లో 174 పరీక్ష కేంద్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు SP తెలిపారు. 33,434 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీ తెలిపారు.

Similar News

News October 16, 2025

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి: ఎస్పీ

image

పోలీసులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ డా. అజిత వేజెండ్ల తెలిపారు. గురువారం నగరంలోని చిన్నబజార్ పోలీసు స్టేషన్‌ను సందర్శించారు. పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశీలించి, పచ్చదనం పెంచాలని, పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మహిళలు, బాలికలు తప్పిపోయిన కేసులలో తక్షణమే స్పందించి, ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాలన్నారు. అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదన్నారు.

News October 16, 2025

24 గంటల్లో ఇద్దరు ఆత్మహత్య..!

image

నెల్లూరు జిల్లాలో గడిచిన 24 గంటల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం మనుబోలు వద్ద ఓ ఇంటర్ విద్యార్థి తనువు చాలించగా, గురువారం నార్త్ రాజుపాలెంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఒకరు పరీక్షలు రాయలేనని, మరొకరు ట్యాబ్ దొంగతనం ఆరోపణలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

News October 16, 2025

నెల్లూరు చేపల పులుసా.. మజాకా.!

image

నెల్లూరు చేపల పులుసుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజా చేపలతో చేసే ఈ పులుసును ఎవరైనా లొట్టలేసుకుంటూ తినాల్సిందే. మన నెల్లూరు చేపల పులుసును ఇతర దేశాలకు సైతం సరఫరా చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. నెల్లూరు చేపల కూరలతో మెట్రోపాలిటన్ సిటీలో కూడా వ్యాపారాలు కొనసాగుతున్నాయి. టేస్ట్‌తోపాటూ దీనిలోని సహజ పోషక లక్షణాలు హృదయ రోగులకు ఎంతో మేలు చేస్తాయి.
# నేడు ప్రపంచ ఆహార దినోత్సవం.