News May 22, 2024

నెల్లూరు జిల్లాలో 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

image

నెల్లూరు జిల్లాలో 10వ తరగతి, ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి లవన్న అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈనెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు పదోతరగతి, ఈనెల 24 నుంచి జూన్ 1 వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.

Similar News

News January 22, 2025

బుచ్చి మండలంలో అమానుష ఘటన

image

ఓ కసాయి తండ్రి తన బిడ్డలను అమ్ముకున్న ఘటన బుచ్చి(M) మినగల్లులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల మేరకు.. పేడూరు రవి, వెంకమ్మ దంపతులకు ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల. మొదటగా పుట్టిన మగ బిడ్డను ఐదేళ్ల క్రితం లక్ష రూపాయలకు అమ్మేశారు. రెండు రోజుల క్రితం మరో మగ బిడ్డను రవి హైదరాబాద్‌కు తీసుకెళ్లి అమ్మాడని వెంకమ్మ తెలిపింది. దీంతో సర్పంచ్ పూజిత ఎంపీడీవో శ్రీహరికి ఫిర్యాదు చేశారు.

News January 22, 2025

మలేషియా జైలులో నెల్లూరు జిల్లా యువకులు   

image

తిరుపతిలోని ట్రావెల్ ఏజెంట్ల మోసంతో ఇద్దరు యువకులు మలేషియా జైల్లో ఉన్నారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెగచర్లకు చెందిన పవన్, సింహాద్రి అనే యువకులను టూరిస్ట్ వీరస్వామి మాయమాటలతో వర్కింగ్ పర్మిట్ మీద మలేషియా పంపాడు. వీరిద్దరూ అక్కడి హోటల్లో పనిచేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మూడు నెలల నుంచి ఆచూకీ లేదని తమ బిడ్డలను ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని బాధితుల తల్లిదండ్రులు కోరారు.

News January 22, 2025

కలెక్టర్ సమక్షంలో విద్యాశాఖ పునర్విభజన సన్నాహక సమావేశం

image

పాఠశాలల పునర్విభజన బోధన సిబ్బంది పునర్నిర్మాణం సన్నాహక సమావేశం నెల్లూరు నగరంలోని జిల్లా కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ సమక్షంలో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోను తూచా తప్పకుండా పాటించాలని, గ్రామస్థుల సూచనలు, వారిని సమన్వయం చేయాలని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ బాలాజీ రావు కొన్ని సూచనలు, మార్పులను ప్రతిపాదించారు.