News April 12, 2025
నెల్లూరు జిల్లాలో 39,130 మంది పాస్

ఇంటర్ ఫలితాల్లో నెల్లూరు జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఇంటర్ సెకండ్ ఇయర్లో 22,720మంది పరీక్షలు రాయగా 19,848మంది పాసయ్యారు. 87శాతం పాస్ పర్సంటేజీతో నెల్లూరు జిల్లా రాష్ట్రంలోనే 5వ స్థానంలో నిలిచింది. ఫస్ట్ ఇయర్లో 26,272 మందికి 19,282మంది పాసయ్యారు. 73శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 7వ స్థానంలో జిల్లా నిలిచింది. మొత్తంగా నెల్లూరు జిల్లాలో 48,992 మంది పరీక్షలు రాయగా.. 39, 130 మంది పాసయ్యారు.
Similar News
News December 9, 2025
జిల్లాలో 15, 16న ఎస్టిమేట్స్ కమిటీ పర్యటన: కలెక్టర్

రాష్ట్ర శాసనసభ ఎస్టిమేట్స్ కమిటీ ఈనెల 15, 16న రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఈనెల 15 సాయంత్రం 6 గంటలకు నెల్లూరుకు చేరుకుని ప్రభుత్వ అతిథి గృహంలో బస చేస్తారన్నారు. 16న మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టరేట్లో తనతోపాటు ఇతర అధికారులతో ఎస్టిమేట్స్ కమిటీ 2019–20, 2020–21, 2021–22 ఆర్థిక సం.ల బడ్జెట్ అంచనాలపై సమీక్ష నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు.
News December 9, 2025
రేపటి నుంచి టెట్ పరీక్షలు: నెల్లూరు DEO

రేపటి నుంచి ఈనెల 21 వరకు టెట్-2025 పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో బాలాజీరావు తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 12:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హాల్ టికెట్లు ఆన్లైన్లోనే పొందవచ్చని పరీక్షా కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలని సూచించారు.
News December 9, 2025
నెల్లూరు: విద్యార్థులకు మరో అవకాశం.!

విక్రమ సింహపురి యూనివర్సిటీ పరిధిలోని వివిధ పీజీ కోర్సులో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ల గడువును ఈ నెల 12 వరకు పొడిగిస్తున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ కే.సునీత తెలిపారు. విద్యార్థుల అభ్యర్థనల మేరకు ఇంకా భర్తీ కాని సీట్లపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రవేశ పరీక్షకు రాకపోయినా సీట్లు పొందే అవకాశం ఉన్నందున ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.


