News July 2, 2024
నెల్లూరు జిల్లా కలెక్టర్గా ఓ.ఆనంద్

నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో ఓ.ఆనంద్ నియామకమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రస్తుతం విశాఖపట్నం జాయింట్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న ఆయన నెల్లూరు కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
Similar News
News December 10, 2025
నెల్లూరు కలెక్టర్కు 2వ ర్యాంకు

నెల్లూరు కలెక్టర్గా హిమాన్షు శుక్లా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ పాలన చూపిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఫైల్స్ క్లియర్ చేస్తున్నారు. సెప్టెంబర్ 9 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ఆయన 682 ఫైల్స్ స్వీకరించారు. ఇందులో 628 క్లియర్ చేశారు. ఒక్కో ఫైల్ను 17 గంటల వ్యవధిలోనే క్లియర్ చేయడంతో ఆయనను సీఎం చంద్రబాబు ప్రశంసించారు. దీంతో ఫైల్ క్లియరెన్స్లో మన కలెక్టర్కు సీఎం రాష్ట్రంలోనే 2వ ర్యాంకు ఇచ్చారు.
News December 10, 2025
నెల్లూరు: రెండేళ్లు అవుతున్నా…!

నెల్లూరు పెద్దాసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్(CCU) భవనాన్ని APMSIDC దాదాపు రూ.12 కోట్లతో నిర్మించింది. ఇంకా కొన్ని పనులు పెండింగ్లో ఉండటంతో ఆ భవనాన్ని తీసుకొనేందుకు GGH అధికారులు ముందుకు రాలేదు. అక్కడ వైద్య పరికరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. మిగిలిన పనులు, వైద్య పరికరాల ఏర్పాటుకు సంబంధించి ఇంకా రూ.10 కోట్ల మేరా పనులు పెండింగ్లో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే రెండేళ్లు గడిచినా పనులు కాలేదు.
News December 10, 2025
కోవూరు: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్లు శిక్ష

కోవూరు పరిధిలో నమోదైన పోక్సో కేస్లో నిందితుడికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.25,000 జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సీపీరెడ్డి సుమ మంగళవారం తీర్పునిచ్చారు. 2021 MAR. 21న మహిళా పోలీస్ స్టేషన్లో కోవూరు(M)నికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన రాయదుర్గం వెంకటేశ్వర్లు అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష ఖరారు చేసింది.


