News August 20, 2024
నెల్లూరు జిల్లా టెన్నికాయిట్ జట్ల ఎంపిక
ఉమ్మడి నెల్లూరు జిల్లా సబ్ జూనియర్ బాల బాలికల టెన్నికాయిట్ జిల్లా జట్ల ఎంపికలు గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ఈ నెల 23వ తేదీ ఉదయం గం.10 లకు జరుగుతాయని జిల్లా టెన్నికాయిట్ అధ్యక్ష, కార్యదర్శులు శ్యామసుందరరావు, రమ్య తెలిపారు. ఈ ఎంపికకు హాజరయ్యే విద్యార్థులు ఏప్రిల్ 2010 తర్వాత జన్మించిన వారై ఉండాలన్నారు. వచ్చేవారు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని తెలిపారు.
Similar News
News September 19, 2024
నెల్లూరు: 15 మంది YCP కార్పొరేటర్లు TDPలో చేరిక
నెల్లూరు నగరానికి చెందిన 15 మంది YCP కార్పొరేటర్లు, నుడా మాజీ ఛైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో TDPలో చేరారు. వీరికి నారా లోకేశ్ పసుపు కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, రూప్ కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు.
News September 19, 2024
Way2News: నెల్లూరు జిల్లాలో రిపోర్టర్లు కావలెను
నెల్లూరు జిల్లాలోని పలు మండలాలకు Way2News రిపోర్టర్లను ఆహ్వానిస్తోంది. ఏదైనా ఛానల్, పేపర్‌లో పనిచేస్తున్నవారు, గతంలో ఏదైనా ఛానల్, పేపర్‌లో పని చేసి మానేసిన వారు అర్హులు. ఈ <
News September 19, 2024
నెల్లూరు: 100 రోజుల పాలనపై మీ కామెంట్ ఏంటి?
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 సీట్లూ గెలిచి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు రేపటితో 100 రోజiల పాలన పూర్తి చేసుకోనుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని రేపటి నుంచి ఈనెల 26 వరకు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించనున్నారు. పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్లు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని వైసీపీ విమర్శిస్తోంది. మరి 100 రోజుల కూటమి పాలన, మీ MLA పనితీరుపై మీ కామెంట్..