News October 31, 2024

నెల్లూరు జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు: ఎస్పీ

image

నెల్లూరు జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి ఎస్పీ కృష్ణ కాంత్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చీకట్లను పారద్రోలి అందరి జీవితాల్లో మరిన్ని కాంతులు నిండాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా జరుపుకునే పండుగ దీపావళి అన్నారు. కాలుష్యరహిత టపాసులను కాల్చాలని సూచించారు.

Similar News

News October 31, 2024

కావలిలో విషాదం.. తల్లి, కూతురు దుర్మరణం

image

కావలిలోని రాజావీధిలో నివాసం ఉంటున్న గార్నపూడి శిరీష, ఆమె తల్లి నత్తల వజ్రమ్మను రైలు ఢీ కొట్టడంతో ఇద్దరూ మృతి చెందారు. ఈ తెల్లవారు జామున తల్లి వజ్రమ్మను విజయవాడ ప్యాసింజరు ఎక్కించేందుకు శిరీష కావలి రైల్వే స్టేషన్‌కు వెళ్లారు. 3వ ప్లాట్ ఫారం వజ్రమ్మ ఎక్కలేక పోయారు. తల్లిని పట్టాలు దాటించేందుకు శిరీష ప్రయత్నించగా అప్పటికే వేగంగా వచ్చిన కోయంబత్తూరు ఎక్స్ ప్రెస్ రైలు ఇద్దరిని ఢీ కొట్టింది.

News October 31, 2024

YSపై మంత్రి ఆనం సంచలన వ్యాఖ్యలు

image

ఆస్తుల గొడవలతో పెద్దాయన(YSR) చరిత్రను నాశనం చేసేలా సొంత వారే ప్రవర్తిస్తున్నారని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఒంగోలులో ఆయన మాట్లాడుతూ.. ‘YSR ఉన్నప్పుడే జగన్ రూ. లక్ష కోట్ల సంపాదించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దోపిడీలో వైఎస్ భాగస్వామ్యం ఎంతనేది ఆలోచించాలి. వైఎస్ అక్రమ సంపాదనను ప్రజలకు పంచిపెట్టాలి. ఇది కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో చెప్పాలి’ అని ఆనం డిమాండ్ చేశారు.

News October 31, 2024

గూడూరు: అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని బాలుడి హత్య

image

వరగలి గ్రామంలో ఈ నెల 7వ తేదీన అనుమానాస్పదంగా మృతి చెందిన బాలుడు లాసిక్‌ను ఉద్దేశ పూర్వకంగానే చంపినట్లు గూడూరు డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. బాలుడు తల్లికి అనిల్ అనే వ్యక్తికి ఉన్న అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని అన్నారు. తమ అక్రమ సంబంధానికి బాలుడు అడ్డుగా ఉన్నాడని భావించిన అనిల్.. చరణ్ అనే వ్యక్తితో కలిసి ఉప్పుటేరులో బాలుడిని తోసి చంపారని ఆయన తెలిపారు.