News February 18, 2026

నెల్లూరు జిల్లా లాడ్జీల్లో తనిఖీలు

image

ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు మంగళవారం రాత్రి లాడ్జీలు, హోటల్స్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. లాడ్జీల్లోని ప్రతీ గదిని క్షుణ్ణంగా చెకింగ్ చేశారు. రాత్రి వేళల్లో లాడ్జిల్లో బస చేసిన వ్యక్తులను ప్రశ్నించారు. వారి వివరాలను ఆరా తీశారు.

Similar News

News March 17, 2026

అక్రమ కేసులకు భయపడం: కాకాణి

image

తప్పు చేసిన వారిని వదిలేసి, ప్రశ్నించే వారిని జైలుకు పంపుతారా? అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. నెల్లూరు జైలులో ఉన్న మాజీ డీసీసీబీ అధ్యక్షుడు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని పరామర్శించారు. ఇసుక దోపిడీని ప్రశ్నించినందుకే ఆయనపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. కూటమి నేతలు చెప్పినట్లు అక్రమ అరెస్టులు చేస్తున్న అధికారులు భవిష్యత్తులో ఇబ్బందులు పడతారని హెచ్చరించారు.

News March 17, 2026

నెల్లూరు: 4107 ఫైర్ యాక్సిడెంట్స్.. రూ. 95 కోట్లు డ్యామేజ్

image

అసలే వేసవి కాలం ఎక్కడ ఏ నిప్పు అంటుకుంటుందో, ఎక్కడ పెను ప్రమాదం పొంచి ఉంటుందో తెలీదు. 2020-26 మధ్య 4107 అగ్ని ప్రమాదాలు జరిగాయి. రూ.95.54 కోట్ల డామేజ్ అవగా, 13 మంది ప్రాణాలు కోల్పోయారు. అగ్నిమాపక సిబ్బంది ఈప్రమాదాల్లో రూ.179 కోట్ల మేరా నష్టం నుంచి కాపాడి 33 మందిని సేవ్ చేశారు. అగ్ని ప్రమాదాలు ఏటా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా లేకుంటే ప్రాణ, ఆస్తి నష్టం జరిగే ప్రమాదం ఉంది.

News March 17, 2026

నెల్లూరు: ఓ పక్క 10th పబ్లిక్ పరీక్షలు.. మరోపక్క తల్లి మరణం

image

దుత్తలూరు (M) భైరవరంలో విషాదఛాయలు నెలకొన్నాయి. అంగన్వాడీ కార్యకర్త దాసరి జయమ్మ గుండెపోటుతో మృతి చెందారు. మృతురాలు కొడుకు రామకృష్ణ వింజమూరు (M) గుండెమడకల జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు. ఈ నేపథ్యంలో పబ్లిక్ పరీక్షలు బాగా రాయాలని తల్లి మాట్లాడిన మాటలు చివరి మాటలు అవుతాయని ఊహించలేదు. పరీక్ష రాసి వచ్చిన తర్వాత తన తల్లి మరణ వార్త విని కన్నీటిపర్యంతమయ్యాడు.