News September 27, 2024
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 24 వరకు ఆంక్షలు
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమల్లోకి తెచ్చినట్లు నాయుడుపేట DSP చెంచు బాబు ప్రకటించారు. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 24 వరకు సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమల్లో ఉంటుందన్నారు. అనుమతి లేనిదే ఎలాంటి సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News October 9, 2024
నెల్లూరు: నేటి నుంచి K.G రూ.50కే టమోటాలు
నెల్లూరు జిల్లా రైతుబజార్‌లలో నేటి నుంచి కిలో రూ.50 చొప్పున సబ్సిడీపై టమోటాల విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ ఏడీ అనితాకుమారి పేర్కొన్నారు. ప్రధానంగా నెల్లూరులోని పత్తేఖాన్ పేట, నవాబుపేట రైతుబజార్లో పాటు, కావలి, కందుకూరు, పొదలకూరు రైతుబజారులలో టమోటాలు విక్రయిస్తారన్నారు. రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు తీసుకుని రావాలని, ఒకరికి రెండు కిలోలు మాత్రమే ఇస్తామన్నారు.
News October 9, 2024
నెల్లూరు జిల్లాలో త్వరలో ఎన్నికలు: కలెక్టర్
నెల్లూరు జిల్లాలో త్వరలో సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఒ.ఆనంద్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇరు శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేసి ఓటరు జాబితా తయారు చేయాలని కోరారు. రెవెన్యూలో ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ల మంజూరు, మ్యూటేషన్ ట్రాన్సాక్షన్లపై తహశీల్దార్లు ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.
News October 8, 2024
నెల్లూరు: భక్తిశ్రద్ధలతో కౌమారి పూజ
నెల్లూరులోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో కౌమారి పూజను మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారి స్వరూపంగా ఓ చిన్నారికి బాలత్రిపుర సుందరి అలంకారం చేసి పూజలు జరిపారు. అనంతరం ఆ చిన్నారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు పోటీపడ్డారు. మరోవైపు బుధవారం మూలా నక్షత్రం సందర్భంగా శ్రీరాజరాజేశ్వరి అమ్మవారు సరస్వతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.