News November 20, 2024

నెల్లూరు జిల్లా సమస్యలపై మాట్లాడిన పవన్

image

NTR సుజలస్రవంతి పథకం కింద 6 జిల్లాల్లో ఓ హబ్, స్పోక్ విధానంలో ప్లాంట్లను నెలకొల్పినట్లు అసెంబ్లీలో డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లాలో పూర్తిస్థాయిలో పనిచేస్తుండగా.. నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, నంద్యాల, శ్రీకాకుళంలో 45 మదర్ ప్లాంట్లను నెలకొల్పారని, అందులో 20 నిరుపయోగంగా ఉన్నాయని పేర్కొన్నారు. నెల్లూరు, CTR, KNL నుంచి పైప్ లైన్ ఏర్పాటుతో పాటు వాటినీ పునరుద్ధరిస్తామన్నారు.

Similar News

News December 13, 2024

నెల్లూరు: రేపు పాఠశాలలకు సెలవు రద్దు

image

రేపు రెండో శనివారం అయినప్పటికీ ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు పనిచేస్తాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్.బాలాజీ రావు తెలిపారు. అక్టోబర్ నెలలో వర్షాల వలన సెలవులు ఇచ్చినందున ఈ నిర్ణయం జిల్లా కలెక్టర్ అనుమతితో తీసుకోవడం జరిగిందన్నారు. సంవత్సరంలో 220 పని రోజులు కచ్చితంగా పాఠశాలలు పనిచేయవలసి ఉందని పేర్కొన్నారు.

News December 13, 2024

జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్ వర్షం కారణంగా వాయిదా

image

రేపు నెల్లూరులో జరగాల్సిన జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్ వర్షం కారణంగా వాయిదా వేసినట్లు జిల్లా పోలీస్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేశారు. వర్షం కారణంగా పాడైనా ట్రాక్ & ఫీల్డ్ ఈవెంట్స్ కోర్ట్ లు తిరిగి సిద్ధం చేస్తున్నామన్నారు. శనివారం జరగవలసిన ఈవెంట్స్ ఆదివారానికి వాయిదా వేసినట్లు వారు తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా పోలీస్ సిబ్బంది, మీడియా గమనించగలరని కోరారు.

News December 13, 2024

చిల్లకూరు మండలంలో పొంగి పొర్లుతున్న వాగులు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నిన్న కురిసిన భారీ వర్షాలకు చిల్లకూరు మండలంలోని పలు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మండలంలోని నాంచారమ్మపేట నుంచి పారిచర్ల వారి పాలెం గ్రామం మధ్యలో ఉన్న వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వాగు ప్రభావితం తగ్గేవరకు అటువైపు వెళ్లే వాహనదారులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలియజేస్తున్నారు.