News August 30, 2024

నెల్లూరు జిల్లా స్పెషల్ ఆఫీసర్‌గా హరికిరణ్

image

కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి స్పెషల్ ఆఫీసర్లుగా IASలను నియమించింది. నెల్లూరు జిల్లాకు ప్రజా వైద్యం, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ చేవూరి హరికిరణ్‌ IAS(2009)ను కేటాయించింది. మరోవైపు తిరుపతి జిల్లా(సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి)కు ఎండోమెంట్ కమిషనర్ సత్యనారాయణ IAS(2006) స్పెషల్ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు..

Similar News

News November 18, 2025

రేపు నెల్లూరు జిల్లాలో 1.95 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు.!

image

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రైతులు ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ రెండో విడత నిధులు బుధవారం వారి ఖాతాలకు జమ కాబోతున్నాయి. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. జిల్లాలో 1.95 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.130.20 కోట్లు జమ అవుతాయన్నారు. నియోజకవర్గాలవారిగా ఎమ్మెల్యేలు, కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

News November 18, 2025

ఢిల్లీలో అవార్డు అందుకున్న నెల్లూరు కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలో 2024-25 సంవత్సరంలో భూగర్భ జలాల పెంపుకు చేపట్టిన చర్యలను అభినందిస్తూ కేంద్రం అవార్డు ప్రకటించింది. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రి పాటిల్ చేతులమీదుగా ఆ అవార్డును అందుకున్నారు. భూగర్భ జలాల పెంపు కోసం వర్షాన్ని ఒడిసిపట్టేందుకు జిల్లాలో 3,495 ఇంకుడు గుంతలు, 856 ఫామ్ పాండ్స్‌తో కలిపి 5,502 భూగర్భ జలాల రీఛార్జ్ పనులు చేసినందుకు అవార్డు లభించినట్లు సమాచారం.

News November 18, 2025

దేవాలయాల సంరక్షణ వేగవంతం: మంత్రి ఆనం

image

నెల్లూరులోని సంతపేట ప్రాంతంలో దేవాదాయశాఖ అధికారులతో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సమీక్ష నిర్వహించారు. దేవాలయాల సంరక్షణ, నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. CGF నిధుల వినియోగంపై సమగ్ర సమీక్ష చేపట్టారు. జిల్లాలోని ఆలయాల అభివృద్ధి పనులు, వాటి పురోగతి, భక్తులకు అందిస్తున్న సేవలపై విస్తృతంగా చర్చించారు. ఆలయాల ఆదాయం–ఖర్చుల నిర్వహణలో పారదర్శకత, మెరుగైన సౌకర్యాల కల్పనపై అధికారులకు సూచనలు చేశారు.