News August 24, 2024
నెల్లూరు జీజీహెచ్ ఆవరణలో మృతదేహం కలకలం

నెల్లూరు జీజీహెచ్ ఆవరణలోని శనివారం గుర్తు తెలియన మృతదేహం కలకలం రేపింది. ఆసుపత్రి వెనుక వైపు కుళ్లిన శవం ప్రత్యక్షమవ్వడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. దుర్వాసన రావడంతో వెళ్లి చూడగా.. కుళ్లినస్థితిలో ఉన్న మృతదేహాన్ని పేషెంట్లు గుర్తించారు. వెంటనే ఆసుపత్రి సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 25, 2025
ఉదయగిరి: ఇల్లు కట్టుకునేవారికి రూ.2.50 లక్షలు

సీఎం చంద్రబాబు సొంత ఇల్లులేని నిరుపేదలందరికీ సొంత ఇల్లు నిర్మించాలని ఉద్దేశంతో పక్కా గృహాలు మంజూరు చేస్తున్నారని ఉదయగిరి నియోజకవర్గ TNTUC అధ్యక్షుడు బొజ్జ శ్రీనివాసులు (గణ) ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నేతృత్వంలో మండలంలోని ప్రతి పేద ఇల్లు నిర్మించుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా రూ.2.50 లక్షలు మంజూరు చేస్తారన్నారు. వివరాలకు సచివాలయంలో సంప్రదించాలన్నారు.
News November 25, 2025
కావలి మాజీ MLAకు సర్జరీ.. జగన్ ట్వీట్

కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి అనారోగ్య కారణాలతో బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని YCP అధినేత జగన్ ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. ఇటీవల బెంగుళూరులో బైపాస్ సర్జరీ చేయించుకున్న రామిరెడ్డి ప్రతాప కుమార్ రెడ్డి విశ్రాంతి తీసుకుంటున్నారు.