News June 28, 2024

నెల్లూరు : జులై 3 వరకు రైల్వేగేటు క్లోజ్

image

మరమ్మతుల నిర్వహణ కోసం కొండాయపాళెం రైల్వేగేటును మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జులై 3వ తేదీ వరకు ఆ మార్గంలో రాకపోకలు జరగవని సూచించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకొని ..అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Similar News

News October 8, 2024

నెల్లూరులో దిగేసిన తెలంగాణ వ్యాపారులు

image

తెలంగాణలో మద్యం వ్యాపారం చేస్తున్న పలువురు ఇప్పుడు నెల్లూరులో షాపులపై గురిపెట్టారు. అక్కడ ఉన్న అనుభవంతో ఇక్కడ కూడా పెద్ద సంఖ్యలో దుకాణాలను పొందేందుకు ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. అందులో భాగంగా ఓ వ్యాపారి 100కి పైగా దరఖాస్తులను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. బంధువులు, స్నేహితులతో కలిసి ఆయన అదృష్టం పరీక్షికునేందుకు సిద్ధమయ్యారని తెలిసింది.

News October 8, 2024

నెల్లూరు: ఇసుక కోసం టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు

image

జిల్లాలో ఇసుక విధానం మీద కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్లోని కమాండ్ కంట్రోల్ హెల్ప్ డెస్క్ కోఆర్డినేషన్ టీంను సచివాలయ ఉద్యోగులతో ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఇసుక సకాలంలో సరఫరా అయ్యేందుకు ఇది పనిచేస్తుందన్నారు. ఇసుక ఫిర్యాదులు, సమాచారం, సందేహాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 0861– 2943569ను సంప్రదించాలని సూచించారు.

News October 8, 2024

వాకాటి నారాయణరెడ్డికి బెదిరింపు కాల్స్.. రూ.15 కోట్ల డిమాండ్

image

మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత వాకాటి నారాయణరెడ్డికి సోమవారం బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. సీబీఐ, ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులమంటూ వాకాటి నారాయణరెడ్డికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. రూ.15 కోట్లు ఇవ్వాలని లేకుంటే వివిధ కేసుల్లో అరెస్ట్ చేస్తామని వాకాటి నారాయణరెడ్డిని బెదిరించారు. దీంతో ఆయన నెల్లూరు వేదయపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.