News May 24, 2024
నెల్లూరు జైలుకు పల్నాడు పెట్రోల్ బాంబుల నిందితులు

పోలింగ్ రోజు దాచేపల్లి మండలం తంగెడలో జరిగిన పెట్రోల్ బాంబుల దాడి ఘటనలో నిందితులను నెల్లూరు, గుంటూరు జిల్లా జైలుకు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. వైసీపీకి చెందిన 22 మందిని, TDPకి చెందిన 11 మందిని అరెస్టు చేసి కోర్టుకు పంపగా 14 రోజులు రిమాండ్ విధించారు. రెండు వర్గాలలో ఒక వర్గం వారిని నెల్లూరు జిల్లా జైలుకు, మరో వర్గం వారిని గుంటూరు జిల్లా జైలుకు పంపారు.
Similar News
News February 17, 2025
GNT: కూలీల మృతిపై సీఎం చంద్రబాబు విచారం

గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. కూలీలతో వెళ్తున్న ఆటోను బుడంపాడు సమీపంలో RTC బస్సు ఢీకొని ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనుల కోసం వెళ్తున్న మహిళలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమన్నారు. మృతులు అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని ముఖ్యమంత్రి అన్నారు.
News February 17, 2025
తెనాలి: బంధువుల వివాహానికి వెళుతుండగా ప్రమాదం

తెనాలి మండలం కొలకలూరు రైల్వే స్టేషన్‌లో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. తెనాలి సమీప గుడివాడకి చెందిన బొద్దులూరి పద్మావతి (55) ఆదివారం ఒంగోలులో బంధువుల వివాహానికి వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కి వచ్చి ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. పట్టాలు దాటుతున్న పద్మావతిని చెన్నై వైపు వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఢీకొట్టడంతో శరీరం నుంచి తలభాగం వేరుపడింది.
News February 17, 2025
నరసరావుపేట: ఈ కొండపై పెళ్లిళ్లు జరగవు

మహాశివరాత్రి, కార్తీక మాస సమయాల్లో కోటప్పకొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. పరమశివుడు దక్షిణామూర్తిగా, బ్రహ్మచారిగా వెలిసిన ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు. కాబట్టి ఇక్కడ పెళ్లిళ్లు కూడా జరగవు. దక్షిణామూర్తి స్వరూపంలో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్లో ఇదొక్కటే. ఇక్కడ మహా శివుడిని పూజిస్తే జాతకంలో గురు బలం పెరుగుతుందని భావిస్తారు. ఈ కారణంగా ఇతర గ్రహాల ప్రభావం పడకుండా రక్షణ పొందుతారు.