News February 19, 2026
నెల్లూరు: టన్నుల్లో కవర్లు.. దొరికేది కేజీల్లోనే

నెల్లూరులో ప్లాస్టిక్ నిషేధం ఎక్కడా అమలు కావడం లేదు. 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్లను నిషేధించినా విక్రయాలు ఆగడం లేదు. సిటీలో టన్నుల కొద్దీ ప్లాస్టిక్ నిల్వలు ఉన్నా అధికారులు మంగళవారం 400 కేజీలే పట్టుకోవడం గమనార్హం. విక్రయదారులకు రూ.1.40 లక్షల ఫైన్ వేశారు. కొండాల్ని తవ్వి ఎలుకను పడుతున్నట్టుగా అధికారుల తీరు ఉందని విమర్శిస్తున్నారు. కవర్ల తయారీ కంపెనీలపై దాడు చేయాలని కోరుతున్నారు.
Similar News
News March 17, 2026
నెల్లూరు: ఓ పక్క 10th పబ్లిక్ పరీక్షలు.. మరోపక్క తల్లి మరణం

దుత్తలూరు (M) భైరవరంలో విషాదఛాయలు నెలకొన్నాయి. అంగన్వాడీ కార్యకర్త దాసరి జయమ్మ గుండెపోటుతో మృతి చెందారు. మృతురాలు కొడుకు రామకృష్ణ వింజమూరు (M) గుండెమడకల జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నారు. ఈ నేపథ్యంలో పబ్లిక్ పరీక్షలు బాగా రాయాలని తల్లి మాట్లాడిన మాటలు చివరి మాటలు అవుతాయని ఊహించలేదు. పరీక్ష రాసి వచ్చిన తర్వాత తన తల్లి మరణ వార్త విని కన్నీటిపర్యంతమయ్యాడు.
News March 17, 2026
నెల్లూరు: నల్లగా ఉన్నావు.. అందంగా లేవంటూ..

భర్త తీరుతో మనస్తాపానికి గురై వివాహిత సూసైడ్ చేసుకుంది. నెల్లూరు అనగుంటకు చెందిన ప్రతాప్, మహిత(20) ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సజావుగా సాగిన కాపురంలో కలతలు చోటుచేసుకున్నాయి. ఆమెను నల్లగా ఉన్నావు.. అందంగా లేవంటూ మానసికంగా వేధించడంతోపాటు కొడుతుండేవాడు. ఈ క్రమంలో ఆమె ఉరేసుకొని సూసైడ్ చేసుకుంది. కుటుంబ సభ్యులు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News March 17, 2026
నెల్లూరు: పది పరీక్షకు 246 మంది డుమ్మా

నెల్లూరు జిల్లాలో మొదటిరోజు 10వ తరగతి పరీక్షకు 246 మంది గైర్హాజరైనట్లు DEO బాలాజీ రావు తెలిపారు. 174 కేంద్రాలలో పరీక్షలు నిర్వహించగా 28,131 మంది విద్యార్థులకు గాను 27,871 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఎక్కడ మాల్ ప్రాక్టీస్‌కు తావు లేకుండా పరీక్షను నిర్వహించామని తెలిపారు.


