News March 27, 2025

నెల్లూరు: టీబీ నిర్ధారణ పరీక్షలు ప్రారంభం

image

నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో C.y.T.B లేటెంట్ క్షయ వ్యాధి నిర్ధారిత పరీక్షలు జరుగుతున్నాయి. సంబంధిత కార్యక్రమాన్ని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి సుజాత, డాక్టర్ ఖాదర్ వలీ బుధవారం ప్రారంభించారు. డీఎంహెచ్‌వో సుజాత మాట్లాడుతూ.. ఈ పరీక్ష ద్వారా క్షయ వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చునని సూచించారు. టీబీ నివారణ వ్యాక్సిన్లు జిల్లాలోని అన్ని సామాజిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయన్నారు.

Similar News

News April 2, 2025

నెల్లూరు: రైళ్లలో దోపిడీ దొంగల బీభత్సం

image

నెల్లూరు జిల్లాలో బిట్రగుంట-పడుగుపాడు రైల్వే స్టేషన్ల మధ్య దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టాలపై సాంకేతిక సమస్యను సృష్టించిన దొంగల ముఠా రెండు రైళ్లను ఆపి దోపిడీ చేసింది. అర్ధరాత్రి సమయంలో బెంగళూరు, చండీగఢ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపారు. బోగీల్లోకి ప్రవేశించి మహిళల మెడలోని బంగారం గొలుసులు, బ్యాగులను దోచుకెళ్లారు.

News April 2, 2025

నెల్లూరు : 3 నుంచి పది మూల్యాంకనం

image

పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఈ నెల 3వ తేదీ నుంచి 9 వ తేదీ వరకు నగరంలోని దర్గామిట్ట జెడ్పీ ఉన్నత పాఠశాలలో మూల్యాంకనం నిర్వహిస్తున్నట్లు డీఈవో బాలాజీ రావు తెలిపారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అధికారులు చేపడుతున్నారని, సిబ్బంది నియామకాలను కూడా పూర్తి చేస్తున్నామన్నారు. ఈ నెల 2 వతేదీ సమావేశం నిర్వహించి ఉపాధ్యాయులకు, సిబ్బందికి విధులు కేటాయిస్తామన్నారు.

News April 2, 2025

రాష్ట్రంలోనే నెల్లూరుకు రెండో స్థానం

image

రాష్ట్రంలో అత్యంత తక్కువ కాలుష్యం ఉన్న నగరాలలో రెండో స్థానంలో నెల్లూరు నిలిచినట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ తెలిపింది. కడప నగరం మొదటి స్థానంలో ఉంది. కర్నూలు, ఒంగోలు మూడో స్థానంలో నిలిచాయని వెల్లడించింది.

error: Content is protected !!