News May 26, 2024
నెల్లూరు: డాక్టర్లకు షోకాజ్ నోటీసులు సిద్ధం

జిల్లాలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న పలువురు డాక్టర్లకు షోకాజ్ నోటీసుల జారీకి వైద్య, ఆరోగ్య శాఖ సిద్ధమైంది. నెల్లూరులో 20, కావలిలో నాలుగు, కందుకూరులో రెండు, ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలో ఒకటి చొప్పున మొత్తం 28 పట్టణ ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటిలో పనిచేస్తున్న డాక్టర్లు సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదన్న కారణంతో డిఎంహెచ్వో పెంచలయ్య నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
Similar News
News October 17, 2025
Way2News కథనం.. విద్యార్థి ఆచూకీ లభ్యం

ఉదయగిరి(M) అన్నంపల్లి విద్యార్థి యోగీశ్వర్ ఆచూకీ లభ్యమైనట్లు కుటుంబీకులు తెలిపారు. <<18019708>>విద్యార్థి మిస్సింగ్<<>> అంటూ Way2Newsలో కథనం వచ్చిన విషయం తెలిసిందే. విద్యార్థి తిరుపతిలో ఉండగా ఓ వ్యక్తి గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు వెంటనే తిరుపతికి వెళ్లి విద్యార్థిని కలిశారు. Way2Newsలో వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తమ బిడ్డను తిరుపతిలో వ్యక్తి గుర్తించి సమాచారం ఇచ్చారని వారు తెలిపారు.
News October 16, 2025
పారదర్శకంగా ఓటర్ల జాబితా నవీకరణ : కలెక్టర్

ఓటర్ల జాబితా నవీకరణ పారదర్శకంగా నిరంతరంగా కొనసాగుతుందని కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు.
గురువారం కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ఫారం 6 లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఫారం 6 లను సంపూర్ణంగా పూర్తిచేసే విధంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు నూతన ఓటర్లకు అవగాహన కలిగించాలన్నారు.
News October 16, 2025
కావలి : పట్టపగలే ఇంట్లో దొంగతనం

కావలిలోని వడ్డెపాలెం రైల్వే క్వార్టర్స్ నందు రైల్వే ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న శైలజ ఇంట్లో మధ్యాహ్నం దొంగతనం జరిగింది. వారి బంధువుల ఇంట్లో కార్యక్రమానికి వెళ్లి ఇంటికి రాగ ఇంటి వెనుక నుంచి తలుపులు బద్దలు కొట్టి ఇంటిని దోచుకున్నారు. రూ.30 వేల నగదు, 3 బంగారు ఉంగరాలు, వెండి మొలతాడు కనిపించట్లేదన్నారు. స్థానిక ఒకటవ పట్టణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.