News August 24, 2024

నెల్లూరు డీఎస్పీ వాహనాన్ని ఢీకొట్టిన వ్యక్తి వివరాలివే

image

వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద నెల్లూరు రూరల్ DSP <<13930649>>వాహనాన్ని ఢీకొట్టి<<>> వెళ్లిపోయిన నిందితుడు డీసీపల్లి టోల్ ప్లాజా సమీపంలో ఆత్మకూరు CIకి పట్టుబడిన సంగతి తెలిసిందే. గంజాయి స్మగ్లర్‌గా అనుమానిస్తున్న అతనిని పోలీసులు విచారించగా..రాజమండ్రి సమీపంలోని రాజానగరానికి చెందిన సూర్యనారాయణగా గుర్తించారు. పట్టుబడిన బొలెరోలో ఎలాంటి గంజాయి లభించకపోవడంతో మార్గమధ్యంలో గంజాయిని దించేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

Similar News

News October 27, 2025

మొంథా ఎఫెక్ట్.. నెల్లూరుకు రూ.కోటి నిధులు

image

మొంథా తుపాన్‌ను ఎదుర్కునేందుకు నెల్లూరు జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. జిల్లాలో సహాయక చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నిధులు విడుదల చేసింది. తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

News October 27, 2025

నెల్లూరు జిల్లాకు రెడ్ అలెర్ట్

image

నెల్లూరు జిల్లాలో చెదురు మొదరు చినుకులుగా ప్రారంభమై భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చే రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ‘గంటకు 45–55 కి.మీ వేగంతో వీచే గాలులు, కొన్ని చోట్ల 65 కి.మీ వరకు వేగం చేరే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, యానం, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల గాలివానలు సంభవించవచ్చు’ అని పేర్కొంది.

News October 27, 2025

నెల్లూరు: డివిజన్లవారీగా కంట్రోల్ రూమ్ నెంబర్లు ఇవే.!

image

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను నేపథ్యంలో జిల్లా కలెక్టరు కార్యాలయంతోపాటు అన్ని రెవెన్యూ డివిజన్ల వారీగా కంట్రోల్ రూమ్‌లను అధికారులు ఏర్పాటు చేశారు.
*జిల్లా కలెక్టరేట్ కంట్రోలు రూం నెంబర్లు: 0861 2331261, 7995576699
*కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయం, : 7601002776
*ఆర్డీవో కార్యాలయం, నెల్లూరు : 9849904061
*ఆర్డీవో కార్యాలయం, ఆత్మకూరు : 9100948215
*ఆర్డీవో కార్యాలయం, కావలి : 7702267559.