News August 8, 2024
నెల్లూరు: డీఎస్సీ గిరిజన అభ్యర్థులకు శుభవార్త
జిల్లాలో డీఎస్సీకి సిద్ధమవుతున్న గిరిజన అభ్యర్థులకు సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పరిమళ తెలిపారు. శిక్షణ సమయంలో భోజన వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 12వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నెల్లూరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కార్యాలయంలో వివరాలు ఇవ్వాలని తెలిపారు. వివరాలకు ఆఫీసు కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
Similar News
News September 10, 2024
విజయవాడకు అండగా నిలిచిన నెల్లూరు
నెల్లూరు పారిశ్రామిక వేత్తలు పలువురు తమ మంచి మనసు చాటుకున్నారు. విజయవాడ వరద బాధితులను ఆదుకొనేందుకు తమ వంతు సాయం అందించారు. సోమిరెడ్డి సమక్షంలో జెమినీ ఎడిబుల్ ఆయిల్స్& ఫ్యాట్ లిమిటెడ్ రూ.2కోట్లు, పామాయిల్ పారిశ్రామిక వేత్తలు రూ.50 లక్షల చొప్పున విరాళం ప్రకటించారు. విజయవాడ కలెక్టరేట్‌లో మంగళవారం చంద్రబాబుకు చెక్కు అందించారు.
News September 10, 2024
నాయుడుపేట: సముద్రంలో యువకుని మృతదేహం లభ్యం
వినాయక నిమజ్జనానికి వచ్చి తూపిలిపాలెం సముద్రంలో గల్లంతైన నాయుడుపేటకు చెందిన యువకుడు మునిరాజా (22) మృతదేహం మంగళవారం మధ్యాహ్నం లభ్యమయ్యింది. నిమజ్జనానికి సోమవారం నాయుడుపేట నుంచి వెళ్లిన యువకులలో ఫయాజ్ మృతి చెందిన విషయం తెలిసిందే. అతనికి స్నేహితుడైన ముని రాజా మృతదేహం కూడా మంగళవారం లభ్యమయింది. ప్రాణ స్నేహితులుగా ఉన్న ఇద్దరి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News September 10, 2024
నెల్లూరు జిల్లాలో ర్యాట్ ఫీవర్?
అల్లూరుకు చెందిన వ్యక్తి ర్యాట్ ఫీవర్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. అతనికి వైరల్ ఫీవర్ ఎక్కువవ్వడంతో చెన్నైలో వైద్యం చేయించుకున్నారు. ఆదివారం మళ్లీ అనారోగ్యానికి గురవ్వగా నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. దీనిపై అల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వరావు వివరణ ఇచ్చారు. ర్యాట్ ఫీవర్ ప్రాణాంతకమని, తాగేనీటిలో ఎలుకలు, పందికొక్కులు మూత్ర విసర్జన చేయడం వలన ఆ వ్యాధి సోకుతుందన్నారు.