News February 7, 2025
నెల్లూరు: తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని తాతపై దాడి

నెల్లూరు రూరల్ బుజబుజ నెల్లూరులో విశ్రాంత సీఐఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ కృష్ణమూర్తి (68) నివాసం ఉంటున్నారు. ఆయన మనవడు అనిల్ సాయి తాగేందుకు డబ్బులు ఇవ్వకపోవడంతో కృష్ణమూర్తిపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కృష్ణమూర్తిను కుటుంబసభ్యులు ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కృష్ణమూర్తి మృతి చెందారు. సమాచారం అందుకున్న కుమారుడు రవికుమార్ వేదయపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Similar News
News December 7, 2025
నెల్లూరులో స్పా సెంటర్లపై దాడులు..10 మంది యువతుల అరెస్ట్

నెల్లూరు బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామలింగాపురం, జగదీశ్ నగర్ సెంటర్లో ఉన్న Unisex, VIP స్పా సెంటర్లపై పోలీసులు దాడులు చేశారు. ఐదుగురు యువతులతో పాటు ఒక విటుడ్ని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులు కృష్ణవేణితో పాటు, సుధీర్‌పై కేసులు నమోదు చేస్తామని సీఐ సాంబశివరావు తెలిపారు. వేదాయపాళెం నిప్పో సెంటర్ వద్ద ఓ స్పా సెంటర్‌పై దాడులు చేసి ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
News December 7, 2025
నెల్లూరు: సిమ్ కార్డుతో మోసాలు

ఇతరుల వద్ద ఫోన్ తీసుకొని సిమ్ కార్డులను మారుస్తూ, ఓటీపీల సాయంతో నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు చీమకుర్తి సీఐ ప్రసాద్ తెలిపారు. గతనెల 29న అందిన ఫిర్యాదు మేరకు SP హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో దర్యాప్తు సాగిందన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన శేషయ్య ఓటీపీల సహాయంతో వచ్చిన డబ్బులను బెట్టింగ్ యాప్‌లకు వాడినట్లు గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. ఇతని వద్ద రూ.2,60,000 రికవరీ చేసినట్లు తెలిపారు.
News December 6, 2025
పెంచలకోనలో విశేష పూజలు

రాపూరు మండలం పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకం, కల్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు.


