News October 15, 2024
నెల్లూరు, తిరుపతి ఇన్ఛార్జ్ మంత్రులు వీరే

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులను నియమించింది. క్యాబినెట్లోని మంత్రులందరికీ కొత్త జిల్లాల వారీగా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది. తిరుపతి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా అనగాని సత్యప్రసాద్, నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మహహ్మద్ ఫరుఖ్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News October 21, 2025
సోమశిలకు ఎలాంటి ప్రమాదం లేదు: సీఈ

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయానికి వరద నీరు చేరుతోంది. ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 77.98 టీఎంసీలు. జలాశయం నిండిన తర్వాత ఒకేసారి నీటిని విడుదల చేయకుండా.. ముందస్తు ప్రణాళికలో భాగంగా కొంతమేర నీటిని విడుదల చేస్తామని సీఈ వరప్రసాద్ వెల్లడించారు. అవసరాన్ని బట్టి నీటి విడుదల ఉంటుందన్నారు. ప్రస్తుతం జలాశయంలో 71 టీఎంసీల నీరు ఉండగా.. ప్రాజెక్టుకు ప్రమాదం లేదని స్పష్టం చేశారు.
News October 21, 2025
నెల్లూరులో అమరవీరులకు నివాళి

పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని నెల్లూరులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పోలీసు పరేడ్ గ్రౌండ్లో అమరవీరుల స్థూపం వద్ద కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజితా వేజెండ్ల, పోలీస్ అధికారులు ఘన నివాళులర్పించారు. జోరు వానలోనూ కవాతు నిర్వహించారు. అంకితభావంతో పనిచేస్తూ అమరత్వం పొందిన పోలీసులను ప్రజలు గుర్తుపెట్టుకుంటారని పలువురు పేర్కొన్నారు.
News October 21, 2025
నేడు నెల్లూరు జిల్లాకు వర్ష సూచన

నెల్లూరు జిల్లాలో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులు సైతం పడే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్స్యకారులు తిరిగి రావాలని సూచించింది. దీపావళి రోజు వర్షం పడటంతో చాలామంది టపాసులు సరిగా పేలలేదు.