News November 27, 2024

నెల్లూరు: తుఫాను ఎఫెక్ట్.. కలెక్టర్ కీలక సూచన

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ అధికారులకు కీలక సూచన చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లోని సమచారాన్ని RDO కార్యాలయాల్లోని కంట్రోల్ రూంకు లేదా కలెక్టరేట్‌‌కు తెలియజేయాలన్నారు. కంట్రోల్ రూం నంబర్లు తిరుపతి కలెక్టరేట్ 0877-2236007 గూడూరు RDO ఆఫీసు 08624-252807, సూళ్లూరుపేట RDO ఆఫీసు 08623-295345ను సంప్రదించాలన్నారు.

Similar News

News December 13, 2024

చిల్లకూరు మండలంలో పొంగి పొర్లుతున్న వాగులు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నిన్న కురిసిన భారీ వర్షాలకు చిల్లకూరు మండలంలోని పలు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. మండలంలోని నాంచారమ్మపేట నుంచి పారిచర్ల వారి పాలెం గ్రామం మధ్యలో ఉన్న వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వాగు ప్రభావితం తగ్గేవరకు అటువైపు వెళ్లే వాహనదారులు, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలియజేస్తున్నారు.

News December 13, 2024

గూడూరు: డాక్టర్ వేధిస్తున్నారంటూ ఫిర్యాదు

image

వాకాడు మండలం నిడిగుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఓ వైద్యాధికారి వేధిస్తున్నారంటూ పలువురు మహిళా ఉద్యోగుల ఆరోపించారు. ఈ మేరకు వారు గురువారం సాయంత్రం గూడూరు డీఎస్పీతోపాటూ విజయవాడలోని వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌కు లికిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిందితుడిపై విచారణ చేపట్టి కఠిన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. 

News December 13, 2024

ఏపీలో పౌర విమానయానం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు ఏమిటి: వేమిరెడ్డి

image

ఏపీలో పౌర విమానయానం అభివృద్ధికి కేంద్రం తీసుకుంటున్న చర్యలు ఏమిటి అని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గురువారం పార్లమెంటులో ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపాదించిన విమానాశ్రయాలు పూర్తి చేయడానికి పట్టే సమయాన్ని తెలియజేయాలన్నారు. ఏవియేషన్ ప్రాజెక్టుల ప్రయోజనం కోసం కేటాయించిన నిధులను తెలియజేయాలన్నారు. సహాయ మంత్రి మురళీధర్ సమాధానమిచ్చారు.