News September 28, 2024

నెల్లూరు: ‘తూకాలు తక్కువగా తూస్తే చర్యలు’

image

వ్యాపారులు కాటాల్లో తేడాలు చేసి తక్కువగా తూస్తే కఠిన చర్యలు తప్పవని తూనికల కొలతల శాఖ జిల్లా డిప్యూటీ కంట్రోలర్ కే ఐసాక్ హెచ్చరించారు. శుక్రవారం ఉదయం నెల్లూరు నగరంలోని ఏసీ కూరగాయల మార్కెట్‌లో ఆయన తనిఖీలు చేశారు. పలు దుకాణాల కాటాలను పరిశీలించారు. ప్రతి వ్యాపారి తప్పనిసరిగా కాటాలను రెన్యువల్ చేయించుకోవాలన్నారు.

Similar News

News October 12, 2024

నెల్లూరు: కిటకిటలాడిన మైపాడు బీచ్

image

మైపాడు: దసరా శరన్నవరాత్రుల్లో చివరి రోజు కావడంతో అనేకమంది ప్రజలు కుటుంబ సమేతంగా మైపాడు బీచ్ చేరుకున్నారు. అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేశారు. మైపాడు బీచ్‌ సముద్ర తీరం పర్యాటకులతో సందడిగా మారింది.

News October 12, 2024

నెల్లూరు జిల్లాలో ఆనం పర్యటన

image

నెల్లూరు జిల్లాలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మూడు రోజులు పర్యటించనున్నారు. అక్టోబర్ 13,14, 15 వ తేదీలలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లాలో స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. గత పది రోజులుగా విజయవాడ, తిరుమల, శ్రీశైలంలోని దసరా ఉత్సవాలలో పాల్గొని జిల్లా పర్యటనకు వస్తున్నారు.

News October 12, 2024

సూళ్లూరుపేట: రైలు ప్రమాదం వెనుక ఉగ్రవాదులు!

image

కవరైపెట్టె రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలును భాగమతి ఎక్స్‌ప్రెస్(12578) ఢీకొనడం వెనుక ఉగ్రవాదుల కుట్ర ఉన్నట్లు భారతీయ రైల్వే అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)తో విచారణ చేయించనున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తులో మరికొన్ని విషయాలు తెలుస్తాయని దక్షణమధ్య రైల్వే జీఎం ఆర్‌ఎన్ సింగ్ తెలిపారు. తిరవళ్లూరు వద్ద పనులు చేపట్టి రైళ్ల రాకపోకలు పునరుద్దరణకు చర్యలు చేపడుతున్నామన్నారు.