News October 27, 2024

నెల్లూరు: తెల్లరేషన్ కార్డు కలిగిన వారికి ఉచిత సిలిండర్లు

image

నెల్లూరు జిల్లాలో తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు అందిస్తున్నట్లు DSO డి.వెంకటరమణ తెలిపారు. రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, ఇతర డేటా బేస్‌తో సరిపోలిన వారు అర్హులన్నారు. ఎల్పీజీ కనెక్షన్, ఆధార్, రేషన్ కార్డు ధ్రువీకరణ కలిగి ఉండి బ్యాంకు అకౌంట్‌కు ఆధార్ అనుసంధానమై ఉండాలని ఆయన తెలిపారు.

Similar News

News December 1, 2025

నెల్లూరు: మెడికల్ కాలేజీలో ఏం జరుగుతోంది..?

image

నెల్లూరు AC సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీలో వరుస సూసైడ్ కేసులు కలవరపెడుతున్నాయి. సరిగ్గా 2 నెలలకింద మెడికో విద్యార్థిని మృతి చెందగా.. తాజాగా మరో మెడికో మృతి చెందింది. అయితే హాస్టల్స్‌ విద్యార్థులపై పర్యవేక్షణ కొరవడిందా?. విద్యార్థులు హాస్టల్స్‌లో ఉన్నప్పుడే సూసైడ్స్ ఎందుకు జరుగుతున్నాయి?. వీటన్నింటిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టి, భద్రతా ప్రమాణాలు పాటించాలని పిల్లల తల్లిదండ్రులు వాపోయారు.

News December 1, 2025

నెల్లూరు: అసంతృప్తిలో కూటమి నాయకులు..!

image

నెల్లూరు జిల్లాలోని కూటమి నాయకుల్లో అసంతృప్తి చెలరేగుతోంది. అధికారంలోకి వచ్చేందుకు కష్టపడి పనిచేసిన తమను మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రతి పనికి మంత్రులు, MLAలే కాంట్రాక్టర్లుగా మారుతున్నారని వాపోయారు. తమకంటూ ఏ పనులు ఇవ్వడం లేదని వాపోతున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఇలాగే ఉందని చెబుతున్నారు. ఈ ప్రభావం స్థానిక ఎన్నికలపై ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.

News December 1, 2025

గూడూరులో దారుణం

image

భార్య, అత్త కలిసి భర్తపై వేడివేడి నూనె పోసిన ఘటన గూడూరు ఇందిరానగర్‌లో జరిగింది. భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుందంటూ భర్త వారం నుంచి గొడవలు పడుతున్నాడు. ఈక్రమంలో భర్త తన బిడ్డలను చూడటానికి గూడూరులోని ఇందిరానగర్‌కు వెళ్లాడు. వేడి నూనె తనపై పోసి చంపడానికి ప్రయత్నం చేశారని బాధితుడు ఆరోపించారు. బంధువులు అతడిని ఆసుపత్రికి తరలించారు.